Congress Leaders Fire On BJP and PM Narendra Modi: వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని కాకుండా అడ్డుకోవాలని బీజేపీ చూస్తోందని.. అందుకే ఎంపీగా పోటీ చేయకుండా అడ్డుకునేందుకు కుట్ర పన్నుతోందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. 2004లో ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. కాంగ్రెస్ ఉచిత విద్యుత్ ఇస్తున్నప్పుడు బీఆర్ఎస్ కూడా తమతోనే ఉందని గుర్తు చేశారు. రైతులకు కాంగ్రెస్ ఏం చేయలేదంటే జనం నమ్మరని అన్నారు. రైతులకు రుణమాఫీ చేసింది సోనియాగాంధీ అని, కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు.
Kavya Kalyanram: బాడీ షేమింగ్ రూమర్స్ .. ‘బలగం’ బ్యూటీ క్లారిటీ
మోడీ వాట్సాప్ యూనివర్శిటీ రాహుల్‌పై అసమర్థుడు అనే ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. అదానికి, మోడీకి సంబంధం ఏంటనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మోడీ భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. అందుకే రాహుల్‌పై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఆరోపణలు చేశఆరు. గుజరాత్ కోర్టులు బీజేపీ కార్యాలయాలుగా మారాయా? అనే చర్చ ప్రజల్లో జరుగుతోందన్నారు. న్యాయస్థానాలపై నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తోందన్నారు. రాహుల్ గాంధీకి మద్దతుగా సత్యాగ్రహ మౌన దీక్ష దేశవ్యాప్తంగా చేపడుతున్నామన్నారు. గాంధీ కుటుంబం దేశానికి ఎంతో సేవ చేసిందని పేర్కొన్నారు.
Bride Cheating: నిత్య పెళ్లికూతురు.. నాలుగు రాష్ట్రాలు, 8 పెళ్లిళ్లు
ఇదే సమయంలో ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ.. విద్వేషాన్ని అడ్డుకోవడానికి, దేశాన్ని రక్షించేందుకు రాహుల్ గాంధీ ఎంతో పోరాడుతున్నారని అన్నారు. దేశాన్ని ఒక్కటిగా ఉంచేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే పోరాటం చేస్తున్నారన్నారు. తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీని ఓడించేందుకు మీరంతా కాంగ్రెస్‌కి, రాహుల్ గాంధీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. తనకు ఆ నమ్మకం ఉందన్నారు. మీరంతా రాహుల్‌కి అండగా ఉండడం ఎంతో బలాన్ని ఇస్తుందన్నారు.