Swine Flu in Telangana: తెలంగాణపై స్వైన్ ఫ్లూ పంజా విసరబోతోందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీజనల్ వ్యాధుల తరహాలోనే స్వైన్ ఫ్లూ కేసులు తెలంగాణపై దాడి చేయబోతున్నాయా? మూడేళ్ళ తర్వాత మళ్ళీ స్వైన్ ఫ్లూ సంకేతాలు వైద్యారోగ్యశాఖకు కలవరం కలిగిస్తున్నాయి. గత రెండు వారాలుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక ఆసుపత్రుల్లో స్వైన్ ఫ్లూ కేసుల పెరుగుదల నమోదైంది. దీంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తం అయింది. స్వైన్ ఫ్లూ (H1N1 Virus) కేసులు సాధారణంగా వర్షాకాలంలో ఎక్కువగా బయటపడుతుంటాయి. ఆస్పత్రుల్లో ఈ కేసుల తీవ్రత క్రమేపీ పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. .
నారాయణ గూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM) కి వస్తున్న శాంపిల్స్ ని పరిశీలిస్తే స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్న సంగతిని డాక్టర్లే నిర్దారిస్తున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ సి. శివలీల 2021, 2020లో ఎలాంటి నమూనాలు పంపలేదని, ఇప్పుడు నమూనాలు అందుతున్నాయని, నమూనాల సంఖ్య కూడా పెరిగిందని చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా శాంపిల్స్ ఐపీఎంకి చేరాయి. 15 రోజుల క్రితం గ్లోబల్ ఆస్పత్రికి కొన్ని శాంపిల్స్ వచ్చాయని డాక్టర్లు తెలిపారు. స్వైన్ ఫ్లూకి సంబంధించిన లక్షణాలు వీరిలో ఎక్కువగా కనిపించాయి. తలనొప్పి, దగ్గు, జలుబు, కడుపులో నొప్పి, విరేచనాలు కనిపించాయి. కోవిడ్ కి సంబంధించి నెగిటివ్ నివేదికలు వచ్చాయి. అయితే వీరికి బ్యాక్టీరియల్ న్యూమోనియా నిర్దారణ అయింది. డాక్టర్లు వీరికి స్వైన్ ఫ్లూ లక్షణాలు వున్నాయని అనుమానిస్తున్నారు.
Also Read
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
అలజడి రేపిన కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు హెచ్1ఎన్1 వ్యాప్తిని కూడా నిరోధించినట్లుగా వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్లూ వ్యాక్సిన్ హెచ్1ఎన్1కు వ్యతిరేకంగా పనిచేస్తుందని, అయితే దీన్ని ప్రతి సంవత్సరం తీసుకోవాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. ఐపీఎంకి రోజూ ఐదారు శాంపిల్స్ వస్తున్నాయని, అయితే రోగుల్ని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకోవడం లేదన్నారు. పూర్తి నిర్దారణకు వచ్చాకే రోగులకు జాగ్రత్తలు చెబుతామన్నారు. పాఠశాలలు కూడా ప్రారంభం కావడంతో పిల్లలు జ్వరం, డయేరియా, కడుపునొప్పి వంటి లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసుల తీవ్రత పెరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ నుంచి వచ్చిన శాంపిల్స్ లో హెచ్ 1 ఎన్ 1 వైరస్ వుందని తేలింది. వైరల్ ఫీవర్స్ కూడా అక్కడ పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో టైఫాయిడ్ తో పాటు స్వైన్ ఫ్లూ విషయంలో అప్రమత్తంగా వుండాలని వైద్యారోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.
Read Also: Yuzvendra Chahal: సమంత బాటలో చాహల్ భార్య.. అతడితో పార్టీకి హాజరుకావడమే కారణమా?
తాజావార్తలు
-
Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
-
Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
-
Upcoming Smartphones: హువావే, లావా, షియోమి, మోటరోలా నుంచి.. జూన్ మొదటి వారంలో విడుదలయ్యే 5G స్మార్ట్‌ఫోన్స్ ఇవే
-
Mamata Banerjee: బీజేపీ ప్రభుత్వం లేకపోతే, మీ సంగతి చూస్తాం.. హాస్పిటల్‌కు మమత వార్నింగ్..
-
IPL Final 2026: ఆ గ్రౌండ్లో అడుగుపెడితే శివాలెత్తిపోతాడు.. RCB గ్యాంగ్‌ను భయపెడుతున్న గిల్ రికార్డులు!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..