Site icon NTV Telugu

Swine Flu Case Detected at Adilabad District: రిమ్స్ లో స్వైన్ ప్లూ కేసు.. అప్రమత్తమైన అధికారులు

Swine Flu

Swine Flu

Swine Flu Case Detected at Adilabad District: రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కేసు కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో తొలి స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న పేషెంట్‌కు స్వైన్ ఫ్లూ సోకిందని నిర్ధారించారు. రిమ్స్‌ కు వచ్చిన జ్వరంతో బాధపడుతున్న పేషెంట్‌కు అనుమానంతో టెస్టులు చేయగా, స్వైన్ ఫ్లూ సోకినట్లు తేలింది. ఈనేపథ్యంలో.. రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే.. కాగా చాలా మంది స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయని, దీంతో స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. వర్షాకాలంలో.. ఈ సీజన్లో ఏజెన్సీలో జ్వరం బాధితుల సంఖ్య పెరుగుతోంది. దీంతో.. వీరిలో చాలా మందికి ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. అయితే.. వైరల్ ఫీవర్ బాధితులు ఎక్కువగా ప్రయివేట్ హాస్పిటళ్లలో చేరుతున్నారు. వారికి చికిత్స అందించే సమయంలో కరోనా మార్గదర్శకాలను పాటించడం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఫీవర్‌ కేసుల వివరాలను ప్రయివేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలు ప్రభుత్వానికి నివేదించడం లేదని సమాచారం. అయితే.. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో చేరుతున్న బాధితుల వివరాలు మాత్రమే ప్రభుత్వానికి తెలుస్తున్నాయి. దీంతో.. ఉట్నూరులోని కేజీబీవీ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుతున్న ఆత్రం కవిత అనే 15 ఏళ్ల విద్యార్థిని రిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. అయితే.. అంతకు రెండు రోజుల ముందు హాస్టల్ సిబ్బంది ఆమెను రిమ్స్‌కు తరలించారు. దీంతో.. వైద్యారోగ్య శాఖ ఇప్పటి వరకూ కోవిడ్‌పైనే శ్రద్ధ పెట్టగా.. ఇకపై స్వైన్ ఫ్లూ కేసుల విషయంలోనూ శ్రద్ధపెట్టాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాకుండా.. ఆదిలాబాద్ జిల్లాలో టీబీ కేసులు కూడా పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
Imran Khan: మరోసారి ఇండియాపై ప్రశంసలు.. జై శంకర్ వీడియోను చూపిస్తూ పొగిడిన ఇమ్రాన్ ఖాన్

Exit mobile version