గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటన పై సస్పెన్స్ కొనసాగుతుంది. పోలీసుల ముమ్మర దర్యాప్తు చేస్తున్న కేసు చిక్కుముడి వీడటం లేదు. గాంధీ ఆస్పత్రి నుంచి బాధిత మహిళ అక్కని సీసీ ఫుటేజ్ లో గుర్తించిన చిలకల గూడ పోలీసులు.. ఆమె ఎటువైపు వెళ్ళింది అనే దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. అయిన బాధితురాలి అక్క ఆచూకీ లభించడం లేదు. గాంధీ ఆసుపత్రిలో ఇప్పటికే సీసీ ఫుటేజ్ తో పాటు కొన్ని ఆధారాలు సేకరించింది క్లూస్ టీం & పోలీసులు. ఈ కేసు చేదించేదుకు 6 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
అయితే బాధిత మహిళ అక్క ఆచూకి కోసం తెలుగు రాష్ట్రాల్లో లుక్ అవుట్ మిస్సింగ్ కేసు నోటీస్ జారీ చేసిన పోలీసులు… నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో నలుగురిని విచారిస్తున్నారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో అనుమానితులు ఉమా మహేశ్వర్, తో పాటు ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది నీ ప్రశ్నించిన పోలీసులు.. ఇప్పటికే బాధితురాలి తోపాటు అనుమానితుల బ్లడ్ శాంపిల్ సేకరించారు. అయిన కేసు ఎటు తేలడం లేదు.