NTV Telugu Site icon

Uttam Kumar Reddy: నాగార్జున సాగర్ ఎడమ కాలువ గండి ని వారం రోజుల్లో పూర్తి చేస్తాం..

Uttamkumar Reddy

Uttamkumar Reddy

Uttam Kumar Reddy: సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నడిగూడెం మండలం కాగితపు రామచంద్రాపురం 132 కిలోమీటర్ వద్ద ఎడమ కాలువకు గండి పడింది. దీంతో గండి పడిన ప్రాంతంలో జరుగుతున్న మరమ్మత్తు పనులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. గండి పూడ్చివేతకు రాష్ట్ర ప్రభుత్వం 2.10 కోట్ల రూపాయలు ఇప్పటికే మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10000 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్ శాఖకు 500 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నారు.

Read also: Warangal Traffic: నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. వరంగల్ సీపీ కీలక సూచన..

యుద్ధ ప్రాతిపదికన కాలువలు చెరువులు పంప్ హౌస్ లను మరమ్మత్తులు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది రైతులకు నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ గండిని వారం రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. రాత్రి పగలు పనిచేసే గంటని పూడ్చే విధంగా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. వరద నష్టాన్ని కేంద్రానికి నివేదిక అందించామన్నారు. కేంద్ర సహాయం కోసం వేచి చూడకుండా.. యుద్ధ ప్రాతిపదికను పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. కేంద్ర సాయం సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Read also: Breaking News: తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత..

మరోవైపు ఎడమ కాల్వ వెంబడి చాలా చోట్ల కాల్వ లైనింగ్, కట్టలు కోతకు గురికావడంతో వరద ముప్పు పొంచి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యాద్గారపల్లి మేజర్‌ పరిధిలోని మిర్యాలగూడ మండలం ఐలాపురం, వేములపల్లి మండలం అన్నపరెడ్డిగూడెం మధ్య దాదాపు 3.5 కిలోమీటర్ల మేర లైనింగ్‌ దెబ్బతిన్నది. నడిగూడెం మండలం రామాపురం, చాకిరాల, సిరిపురం, కహిరారామచంద్రాపురం గ్రామాల సమీపంలో కాలువ కట్టలు దెబ్బతిన్న విషయం తెలిసిందే..
స్నానానికి సబ్బు వద్దు.. సున్నిపిండి బెటర్‌..