NTV Telugu Site icon

Suryapet Principal: ప్రిన్సిపాల్‌ రూమ్‌లో బీరు బాటిళ్ల ఘటన.. మంత్రి ఉత్తమ్‌ సీరియస్‌..

Suryapet Principal

Suryapet Principal

Suryapet Principal: సూర్యాపేటలోని బాలెంల సాంఘిక సంక్షేమ, బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ వేధిస్తున్నారని విద్యార్థులు రెండు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. శనివారం ప్రిన్సిపాల్‌ గదిలో 4 బీరు సీసాలు కనిపించడంతో ఆమె గదికి తాళం వేసి నిరసన తెలిపారు. ప్రిన్సిపల్ శైలజ తమతో దురుసుగా ప్రవర్తిస్తోందని, భోజనం సక్రమంగా అందించడం లేదని, ప్రశ్నిస్తే చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు సూర్యాపేట-జనగాం రహదారిపై 4వ తేదీన బైఠాయించగా.. చర్యలు తీసుకుంటామని సాంఘిక సంక్షేమ గురుకులాల ప్రాంతీయ సమన్వయకర్త అరుణకుమారి హామీ ఇచ్చి ఆందోళన విరమించారు.

Read also: Ashada Masam 2024: ఆషాఢ మాసంలో ఈ పనులు చేస్తే అంతా సంతోషమే..!

ఇటీవల ప్రిన్సిపల్ శైలజ కేర్ టేకర్ సౌమిత్రితో కలిసి తన ఛాంబర్ లోనే అర్ధరాత్రి వరకు మందు తాగానని, సమస్యలపై ప్రశ్నిస్తే ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ వేణుమాధవరావు, ఆర్‌సీఓ అరుణకుమారి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి జ్యోతి, డీఎస్పీ రవికుమార్, సీఐ రాజశేఖర్, రూరల్ ఎస్సై బాలునాయక్ కళాశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. శైలజను సస్పెండ్ చేయడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ప్రిన్సిపాల్ గదిలో బీరు సీసాలు బయటపడిన ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌ను శనివారం విచారణకు ఆదేశించారు. దీంతో కలెక్టర్ కమిటీ అధికారిణిగా అదనపు కలెక్టర్ లత, జెడ్పీ డిప్యూటీ సీఈవో శిరీష, ఆర్డీఓ వేణుమాధవ్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి లత సభ్యులుగా విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
Ashwaraopet SI: అశ్వారావుపేట ఎస్సై ఘటన విషాదం.. చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి..

Show comments