Site icon NTV Telugu

కల్నల్ సంతోష్ బాబుకు ‘మహవీర చక్ర’ అవార్డ్‌..

తూర్పు లద్దాఖ్‌ గాల్వాన్‌ లోయ ప్రాంతంలో గత సంవత్సరం జూన్‌ 15 రాత్రి చైనా సైనికులతో జరిగి ఘర్షణలో వీరోచితంగా పోరాడి అమరుడైన కల్నల్‌ సంతోష్‌బాబుకు ‘మహావీర చక్ర’ పురస్కారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం కల్నల్‌ సంతోష్ బాబు సతీమణి సంతోషి, ఆయన మాతృమూర్తి మంజుల ఈ అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అందుకున్నారు.

గత సంవత్సరం గాల్వాన్‌ లోయలో 16-బీహార్‌ రెజిమెంట్‌కు కమాండింగ్‌ చీఫ్‌గా కల్నల్‌ సంతోష్‌ నేతృత్వం వహిస్తున్నారు. అయితే చైనా-భారత్‌ సరిహద్దుల్లో ఒకటైన లద్దాఖ్‌ గాల్వాన్‌ లోయ ప్రాంతంలో జరిగిన ఘర్షణ లో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. వారితో పాటు కల్నల్‌ సంతోష్‌బాబు కూడా భరతమాత ఒడిలో ఓదిగిపోయారు. దీంతో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు అందజేసే రెండో అత్యున్నత అవార్డు మహావీర చక్ర ఆయనకు లభించింది.

Exit mobile version