NTV Telugu Site icon

MLAs Poaching Case: చంచల్‌ గూడా జైలుకు ఈడీ.. నందకుమార్ ను విచారించనున్న సుమిత్ గోయల్ టీమ్

Mlas Poaching Case

Mlas Poaching Case

MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ ను నేడు ఈడీ అధికారులు విచారించనున్నారు. నందకుమార్ ను విచారించేదుకు ఈడీ అధికారులు చంచల్ గూడా జైలుకు వెళ్లనున్నారు. నందకుమార్ ను ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ గోయల్ టీమ్ విచారించనున్నారు. అసిస్టేంట్ డైరెక్టర్లు సుమతిమ్‌, గోయల్ తో పాటు దేవేందర్ కుమార్ సింగ్, అజిత్ లను కోర్టు అనుమతిచ్చింది. నందకుమార్ స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కోర్టు అనుమతిచ్చింది. నందకుమార్ న్యాయవాది సమక్షంలోనే స్టేట్ మెంట్ రికార్డు చేయనున్నారు ఈడీ అధికారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లోని సెక్షన్ 50 కింద నందు నుండి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు సిద్దమయ్యారు. స్టేట్‌మెంట్ రికార్డు చేసిన తరువాత వాటికి సంబంధించిన డాక్యుమెంట్లును నేరుగా కోర్టుకు సమర్పించాలిని ఈడీ డైరెక్టర్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెవెన్ హిల్స్ మాణిక్ చంద్ యజమాని అభిషేక్ ఆవలను విచారించిన ఈడీ, ఈ కేసు విచారణలో బయటపడ్డ ఆర్థికలావాదేవీలపై నందును ఈడీ విచారించనుంది.

Read also: Vizag Tragedy:ఎండాడలో విషాదం.. అపార్ట్ మెంట్ నుంచి పడి విద్యార్ది మృతి

ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫామ్‌హౌస్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న నందకుమార్‌ను విచారించేందుకు నాంపల్లి కోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.. క్రిస్మస్ సెలవులు ఉన్నందున నేడు, రేపు (26, 27) తేదీల్లో నందు కుమార్‌ను చంచల్‌గూడ జైలులో విచారించనున్నారు. బీజేపీలో చేరితే 100 కోట్లు ఇస్తానని రోహిత్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం కేసు నడుస్తోంది. ప్రస్తుతం సిట్ విచారణ నిలిచిపోయింది. ఏసీబీ..సిట్ దర్యాప్తు చేయాలా అనే అంశంపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా రోహిత్ రెడ్డికి నందకుమార్ వ్యాపార భాగస్వామి అని తేలింది. ఆర్థిక లావాదేవీలను గుర్తించారు. దీంతో ఈడీ పలువురిని ప్రశ్నించింది.ఈడీ విచారణలో నందకుమార్ నోరు విప్పితే ఏమవుతుంది? అతను ఏ విషయాలు బయటపెడతాడు? మరి ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Read also: China-Taiwan Conflict: తైవాన్ సరిహద్దుల్లో చైనా యుద్ధవిన్యాసాలు.. ఆక్రమణే లక్ష్యమా..?

ఎమ్మెల్యే కొనుగోలు కేసుతో ముడిపడిన మాణిక్‌చంద్ గుట్కా కేసుపై కూడా ఈడీ దృష్టి సారించే అవకాశం ఉంది. నందకుమార్ విచారణను చంచల్ గూడ జైలులోని వీడియో కెమెరాలో రికార్డు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి, అతని సోదరుడికి సుదీర్ఘకాలంగా సంబంధాలున్నట్లు ఇప్పటికే విచారణలో తేలింది. వీరితో నందకుమార్ పలు వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఎమ్మెల్యేల ఎరతో పాటు మాణిక్‌చంద్ గుట్కా కేసుకు సంబంధించిన కీలక సమాచారం కూడా రాబట్టే అవకాశం ఉంది. నందకుమార్ సమాచారం, వెల్లడించిన పేర్ల ఆధారంగా ఈడీ మరింత దూకుడుగా ముందుకెళ్లే అవకాశం ఉంది.
Hijras Created Havoc: పోలీస్ స్టేషన్ లో హిజ్రాలు వీరంగం .. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం

Show comments