NTV Telugu Site icon

Vikarabad Love Success: ప్రియురాలా మజాకా.. ధర్నాచేసి ప్రియున్నే పెళ్లాడింది

Vikarabad Love Success

Vikarabad Love Success

Successful love story in Vikarabad: వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలో ప్రేమ వ్యవహారంలో ఉదయం ప్రయుడి ఇంటిముందు ఆందోళనకు దిగిన ప్రియురాలు సుజాత ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకుంది. ఎవరినైతే ప్రేమించిందే తను మొఖం చాటేసిన తనతోనే జీవించడానికి సిద్దమైంది. ఇన్నాళ్లు ప్రేమించి చివరకు ప్రియురాలిని వదిలేద్దాం అనుకున్న ప్రియుడికి తగిన బుద్ది చెప్పింది. ప్రియుడు కేశవులుతో గ్రామ పెద్దలు, కులస్తుల సమక్షంలో ప్రేమ వ్యవహారానికి గుడ్‌ బై చెప్పి పెళ్లి చేసుకునేందుకు ఒప్పించింది. చివరకు ప్రేమ వ్యవహారం కాస్త పెళ్లిచేసుకుందుకు దారితీసేలా ధర్నా చేసి తన జీవితాన్ని ప్రియుడితోనే పంచుకునేందుకు సిద్దమైంది. ఇది చూసిన ప్రతి ఒక్కరు ప్రియుడికి తిట్టిపోస్తున్నారు. ప్రియురాలిని ఎలా మోసం చేయాలని అనిపించింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని ప్రియురాలిని పెళ్లి చేసుకుని ఆన్యోన్యంగా ఉండాలని కోరుతున్నారు.

Read also: KTR: సత్తా చాటిన కేటీఆర్‌.. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో చోటు

వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రానికి చెందిన కేశవులు అనే యువకుడు తాను ప్రేమిస్తున్నానంటూ అదే గ్రామానికి చెందిన యువతిని దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఇద్దరూ చెట్టపట్టాలేసుకొని కొన్ని రోజులు కలిసి తిరిగారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు. ఆ తర్వాత శారీరకంగా సన్నిహితంగా మెలిగింది. ఆ తర్వాత కూడా పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక మాయమాటలు చెప్పి శారీరకంగా ఆమెను శారీరకంగా లోబర్చుకునేవాడు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి పలుమార్లు కోరగా.. మాట దాటవేసేవాడు. చివరకు యువతిని, కేశవుని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. మోసపోయానని గ్రహించిన యువతి కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు కేశవులు ఇంటికి చేరుకుని నిలదీశారు. పెళ్లి చేసుకోమని అడిగారు.

Read also: TSPSE AEE Hall Tickets: ఏఈఈ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్.. పరీక్ష ఎప్పుడంటే?

అతను నిరాకరించడంతో ప్రియుడు కేశవుని ఇంట్లోనే ఉంచి బయట నుంచి తాళం వేశారు. అనంతరం ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఇదే విషయమై తాను గతంలో చర్ల కుర్కచర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరినట్లు యువతి ఆరోపించింది. అయితే ప్రియుడు చేసిన మోసానికి ఆమె బలికాకూడదని ప్రియుడితోనే పెళ్లి చేసుకుంటానని గొడవకు దిగింది. ఈ గొడవ కాస్తా పంచాయితికి దారి తీయడంతో.. పెద్దల సమక్షంలో ప్రియుడు తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోవడంతో యువతి కుటుంబ సభ్యులు శాంతించారు.
Sridevi First Husband: శ్రీదేవి మొదటి భర్త? అప్పట్లో సంచలనం