NTV Telugu Site icon

KTR: నేను ఇంటర్ చదివింది గుంటూరులోనే కానీ.. వాటిగురించి మాట్లాడను

Ktr

Ktr

KTR: ఇంటర్మీడియట్ గుంటూరులో చదువుకున్నానని మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇంటర్ క్లాస్మేట్ హైదరాబాద్.. కెనెడా కంటే బాగా ఉందని అన్నారు మంత్రి. లేనిపోని కామెంట్స్ నేను చేయననని అన్నారు. గుంటూరు బాగనే ఉంది, వైజాగ్ బగనే ఉంది, విజయవాడ బాగనే ఉంది, అన్ని బాగా ఉన్నాయని వాటి గురించి మాట్లాడనని మంత్రి అన్నారు. నాలుగవ తరగతిలో హైదరాబాద్‌ నగరానికి వచ్చానని ఇక్కడి వాతావరణం అలవాటు పడ్డాక, గండిపేట నీళ్ళు పడడంతో నీళ్ళు వంటబట్టాయి అనేవారని తెలిపారు మంత్రి. 1908వ సంవత్సరంలో మూసి వరదలు వచ్చినప్పుడు నిజాం మోక్షం గుండం విశ్వేశ్వరయ్య ను పిలిచి రిజర్వాయర్ కు ప్రణాళికలను ఇవ్వమన్నారని తెలిపారు. 103 సంవత్సరాల కింద ఈ రెండు రిజర్వాయర్లు కట్టారని అన్నారు. మన నగరానికి అతి పెద్ద వరం మూసి అని, 94 శాతం నీరు గ్రావిటీ ద్వారా మన మూసిలోకి వస్తాయని, అప్పటి రూపురేఖలు మారిపోయాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Read also: Summer Heat: హైదరాబాద్ లో వేసవి తాపం.. ఎల్లో అలర్ట్ జారీ

దేశంలోనే అతిపెద్ద అర్బన్ డెవలప్ మెంట్ అథారిటి మన హెచ్ ఏం.డి.ఏ అని వ్యాఖ్యానించారు. కుటుంబ సమేతంగా కొద్ది సేపు సమయం గడుపుదామని అనుకునే వారికి ఈ చెరువులు ఉపయోగపడతాయన్నారు. ఈ మధ్యకాలంలో దుర్గం చెరువు బ్రిడ్జ్ లేని సినిమా లేదని ఆనందం వ్యక్తం చేశారు. ఫాక్స్ కాన్ చైర్మన్ 200 ఎకరాల్లో యూనిట్ పెడుతున్నారని తెలిపారు. వారిని కొంగరకలాన్ నుండి ఓ.ఆర్.ఆర్ మీదుగా దుర్గం చెరువు బ్రిడ్జి మీదుగా తీసుకు వచ్చానని, ఆయన సీఎం కేసీఆర్ వద్దకు వచ్చాక ఇది ఇండియానేనా అని అన్నారు. మన నగరం చాలా అభివృద్ధి చెందిందని విదేశాల నుండి వచ్చిన వారు చెబుతున్నారని తెలిపారు. 50 చెరువులను తాము అభివృద్ధి చేస్తామని పెద్ద కంపెనీలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. చెరువు అభివృద్ధికి కోటి రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారని, మీరు ఇక్కడ లాభాల కోసం చూడకండని, మన ముందు తరాలకు వీటిని అందించాలని తెలిపారు.

Read also: Prabhas: ‘ఆదిపురుష్’ విజయానికై వైష్ణోదేవి మందిరానికి..

చెరువులలో పట్టా భూములు ఉన్నయి.. ఇందుకోసం ఒక ఆలోచన చేసామని మంత్రి పేర్కొ్న్నారు. 13 చెరువులలో ఉన్న 115 ఎకరాల ప్రైవేట్ భూములను సేకరించి 182 టి.డి.ఆర్ లు ఇచ్చామన్నారు. మేము చెరువులను వారికి రాసివ్వడం లేదని, వారితో ఇక్కడ ఖర్చు చేయిస్తున్నమన్నారు. చిన్న తప్పు జరిగినా అందరం బద్నాం అవుతామని తెలిపారు. 2022 లో ఆఫీస్ స్పేస్ లో నంబర్ వన్ వచ్చింది మన హైదరాబాద్ అన్నారు. కట్టు కథలు, పిట్ట కథలు చెబితే పెట్టుబడులు రావన్నారు. వాక్సిన్ నగరంగా హైదరాబాద్ ఉందని కేటీఆర్‌ పేర్కొ్న్నారు. వచ్చే సంవత్సరం వరకు1400 కోట్ల వాక్సిన్ ఉత్పత్తి అవుతుందని, ఫాక్స్ కాన్ వల్ల 30 వేల మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. ఫెడ్ ఎక్స్ ఒక్క సంస్థ ఏడు వేల ఉద్యోగాలు సృష్టించిందని, గతేడాది లో లక్ష 50 వేల ఉద్యోగాలు సంవత్సరం వచ్చాయని, 2021 లైఫ్ సైన్సెస్ సిస్టం విలువ 50 బిలియన్ డాలర్లని తెలిపారు.

Read also: Ram Charan Birthday: రామ్‌ చరణ్ బర్త్‌ డేలో సెలబ్రెటీల సందడి

2030 వరకు 250బిలియన్ డాలర్లు అనుకుంటున్నామని, ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందు ఉందని పేర్కొన్నారు. 31 కి.మి ఏర్పొట్ మెట్రోను మూడేండ్ల లో పూర్తి చేస్తామన్నారు. పటాన్ చెరువు నుండి లకడికా పుల్, నాగోల్ నుండి ఎల్బి నగర్ వరకు మెట్రో విస్తరణకు సహకరించాలని కేంద్రాన్ని కోరితే అది అంత ఫిసబుల్ కాదని సమాచారం వచ్చిందని మండిపడ్డారు. వారు సహకరించిన, సహకరించకపోయిన మెట్రొను విస్తరిస్తామమన్నారు. ఉత్తర ప్రదేశ్ లో పది నగరాల్లో మెట్రో నిర్మిస్తున్న వారికి డబ్బులు ఇస్తారు. మరి ఇక్కడ ఎందుకు ఇవ్వరని, మన పన్నులు తీసుకుని ఇతర నగరాల అబివృద్దికి ఇస్తున్నారు, మరి మనకు ఎందుకు ఇవ్వరు. వివక్ష చూపితే బాధ అనిపిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా హైదరాబాద్ నగర అబివృద్దికి సహకరించాలని కోరారు. ఫార్మా సిటీ వస్తుంది. ఇంకా చాలా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

Read also: Rahul Gandhi: ఎంపీ బంగ్లాను ఖాళీ చేస్తా.. “హ్యాపీ మెమోరీస్” అంటూ రాహుల్ లేఖ

కోవిడ్ వలన ప్రభుత్వానికి లక్ష కోట్ల ఆదాయం నష్టం వచ్చిందని, నగరానికి 250 కి.మి మెట్రో తప్పకుండా ఉండాలని పేర్కొన్నారు. 500 ఎలక్ట్రికల్ బస్ లను తెస్తున్నామని, మూసి పై 14 బ్రీడ్జ్ లను పది వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామన్నారు. రాచకొండ వద్ద ఒలంపిక్ స్థాయి సినిమా సిటీ కావాలని, చెరువుల అభివృద్ధిని నామమాత్రంగా చేయకండని మంత్రి కోరారు. డబ్బాలాగా బిల్డింగ్ లను కట్టకండని, మంచి అర్కిటెక్షర్ తో బ్రహ్మాండంగా కట్టండని సూచించారు. జూలై చివరి వరకు దేశంలోనే వంద శాతం మురుగు నీటి శుద్ధి గల నగరంగా హైదరాబాద్ అవుతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రైవేట్ ఎస్.టి.పి లను నిర్మించాలని తెలిపారు. చెరువుల వద్ద వాకింగ్ ట్రాక్, ప్లాంటేషన్, ఓపెన్ జిమ్, టాయిలెట్స్, లైటింగ్, పిల్లలు ఆట స్థలాలు, సామాజిక కార్యక్రమాలకు వాడుకోవాలి అనుకుంటే అంఫి థియేటర్ ఉండాలన్నారు. జిల్లా కేంద్రంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల సుందరికరణను చేస్తున్నామని కేటీఆర్‌ అన్నారు.
Rajinikanth: ఆ క్రేజ్ ఏంటి సామీ… నువ్వు నిజంగానే ఇండియన్ సినిమా బాద్షా

Show comments