Site icon NTV Telugu

మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. హైదరాబాద్‌లోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని జేఎన్టీయూహెచ్, ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థులు ముట్టడించారు. ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలి లేదా ఆన్లైన్ విధానం ద్వారా ఎగ్జామ్స్ నిర్వహించాలంటూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు విద్యార్థులు. ఇందులో భాగంగానే సత్యసాయి నిగమాగమం నుండి మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇంటి వరకు ర్యాలీగా బయలుదేరారు విద్యార్థులు.

read also : సినిమాలో కోడి కథ లాగే కేసీఆర్‌ వాగ్దానాలు : విజయశాంతి సెటైర్‌

తమ డిమాండ్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సబితా మంత్రి ఇంద్రా రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అయితే… దీనిపై స్పందించిన మంత్రి సబితా… కొద్ది మంది విద్యార్థులతో మాట్లాడి… ఇప్పటికే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. విద్యార్థులు ఎక్కడ కోరితే అక్కడే పరీక్ష కేంద్రాలు ఉండేలా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Exit mobile version