Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Students Of Nizam College Who Met Minister Sabita Indra Reddy

Sabitha Indra Reddy: లిఖితపూర్వంగా హామీఇవ్వండి.. మంత్రి సబితాను కలిసిన నిజాం కాలేజీ విద్యార్థులు

Published Date :November 11, 2022 , 1:25 pm
By NTV WebDesk
Sabitha Indra Reddy: లిఖితపూర్వంగా హామీఇవ్వండి.. మంత్రి సబితాను కలిసిన నిజాం కాలేజీ విద్యార్థులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sabitha Indra Reddy: మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిజాం కాలేజీ విద్యార్థులు మరోసారి కలిసారు. మార్చిలో హాస్టల్‌ను ప్రారంభించామని, నేటికీ యూజీ విద్యార్థులను హాస్టల్‌లో ఉంచేందుకు కళాశాల యాజమాన్యం అనుమతి ఎందుకు ఇవ్వడంపై లేదంటూ ఆందోళన నేపథ్యంలో.. ఈవిషయమై మంత్రిని కలిసారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి సబితా 50-50 శాతం డిగ్రీ పీజీ విద్యార్థులకు కేటాయిస్తామని, ఆరు నెలల్లో కొత్త బిల్డింగ్ కట్టిస్తామని చెప్పిన మంత్రి సబితా హామీ ఇచ్చారు. అయితే.. లిఖితపూర్వంగా హామీ ఇచ్చి, కట్టించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ హామీకి మేము ఒప్పుకోమని, విద్యార్థులు నిరసన కొనసాగిస్తున్నారు.

నిజాం కాలేజీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల హాస్టల్ కేటాయింపు సమస్యపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. ఆందోళన చేస్తున్న విద్యార్థుల పక్షాన నిలబడి ఈ విషయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జోక్యం చేసుకుని తక్షణమే సమస్యను పరిష్కరించాలని నవంబర్‌ 8న మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. తన మాట ప్రకారం హాస్టల్ నిర్మించి కాలేజీకి ఇచ్చినా ఈ వివాదం అనవసరమన్నారు కేటీఆర్. వెంటనే సమస్యకు ముగింపు పలకాలని నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌కు సూచించారు. నూతనంగా నిర్మిస్తున్న మహిళా హాస్టల్‌లో విద్యార్థినులకు వసతి కల్పించాలని కోరుతూ నిజాం కళాశాల విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నవిషయం తెలిసిందే. మార్చిలో హాస్టల్‌ను ప్రారంభించామని, నేటికీ యూజీ విద్యార్థులను హాస్టల్‌లో ఉంచేందుకు కళాశాల యాజమాన్యం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని నిలదీశారు. కళాశాల హాస్టళ్లలో వసతి అవసరమైన సుమారు 500 మంది విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో భారీగా డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌లో వసతి కల్పించాలని కళాశాల అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అధ్యక్షతన ఇంటర్ బోర్డు సమావేశం

ఇక మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అధ్యక్షతన ఇంటర్ బోర్డు సమావేశమైంది. పలు అంశాల పై చర్చిస్తున్నారు. మిక్స్ డ్ అక్యుపెన్సీ బిల్డింగ్ లో నడుస్తున్న ప్రైవేట్ కాలేజీల అనుబంధ గుర్తింపు, ఆ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను ప్రైవేట్ గా పరీక్షలకు రాయించే అంశంపై చర్చిస్తున్నారు.

ఎజెండాలో 111 అంశాలు పేర్కొన్నారు కొన్ని అంశాలు
1. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు అనుబంధ గుర్తింపు ఫీజుల పెంపు
2. ఇంటర్ పరీక్ష ఫీజు పెంపు
3. ప్రైవేట్, ప్రభుత్వ కాలేజీల్లో బయో మెట్రిక్ హాజరు
4. ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్
5. Tspsc ద్వారా ఇంటర్ బోర్డ్ లో 52 ఉద్యోగాల భర్తీ
6. గ్లోబరీనా టెండర్ ప్రకారం ఆ సంస్థకు ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చే అంశం…
7. ఇంగ్లిష్ లాంగ్వేజ్ లో ప్రాక్టికల్స్ మొదలగు వాటిపై చర్చజరుగుతుంది.
Twitter Paid Verification Service: ట్విట్టర్‌ బ్లూటిక్‌.. భారతీయులు ఎంత చెల్లించాలో తెలుసా..?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • minister Sabita indra reddy
  • Nizam College
  • sabita indra reddy
  • students of nizam
  • students of nizam college

తాజావార్తలు

  • First Ramayana Movie: వెండి తెరపై తొలి రాముడు.. తొలి సీత ఎవరో తెలుసా? 109 ఏళ్ల నాటి అరుదైన ‘రామాయణ’ విశేషాలు ఇవే!

  • Liquor Sales: ఏరులై పారుతున్న మద్యం.. 70% పెరిగిన బీర్ల అమ్మకాలు.. కానీ ఆదాయం మాత్రం!

  • Nitish Kumar Reddy: ఐయామ్ ఫుల్ హ్యాపీ.. తెలుగోడు నితీష్ రెడ్డి భావోద్వేగం!

  • Lalit Modi: లూజర్, జోకర్.. సంజీవ్ గోయెంకాపై మండిపడ్డ ఐపీఎల్ సృష్టికర్త..!

  • NBK113 : పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో నందమూరి బాలకృష్ణ

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions