Site icon NTV Telugu

ఓయూలో సమాధి కలకలం..!

ఉస్మానియా వర్సిటీలోని ఇంజనీరింగ్‌ కళాశాలలో సమాధి కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం కాలేజీ హాస్టల్‌ వెనుక స్థలానికి వెళ్లిన కొందరు విద్యార్థులకు సమాధి కనిపించడంతో భయంతో హాస్టల్‌ కు పరుగులు తీశారు. అనంతరం.. ఈ విషయాన్ని తోటి విద్యార్థులకు చెప్పారు. అక్కడితో ఆగని ఆ విషయం… చీఫ్‌ వార్డెన్‌ దృష్టికి వెళ్లింది. సమాధిలో జంతువునా.. మనిషిని పూడ్చి పెట్టారా.. అనేది తెలియాల్సి ఉంది.

సమాధిపై చల్లిన పూలు తాజాగా ఉండగా… ఇటీవలే తవ్వి పూడ్చినట్లుగా ఆ సమాధి ఉంది. ఓయూలోకి బయటి వ్యక్తులు రాకుండా కొత్త సెక్యూరిటీతో పటిష్ట బందోబస్తు చేశామని… రౌండ్‌ ది క్లాక్‌ సెక్యూరిటీ… పెట్టామని.. అధికారులు చెపుతుండగా… మరోవైపు క్యాంపస్‌ లో సమాధి కనిపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఈ సంఘటనపై పోలీసులకు ఇంకా ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.

Exit mobile version