NTV Telugu Site icon

Suryapet: దారుణం.. గురుకుల హాస్టల్‌లో ఉరికి వేలాడుతూ కనిపించిన విద్యార్థి..!

Suryapet Gurukula School

Suryapet Gurukula School

Suryapet: సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థి అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలలో గురువారం ఉదయం వెలుగు చూసింది.

నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన ఆలకుంట్ల వెంకన్న, జయలక్ష్మి దంపతుల కుమారుడు రాకేష్ (16) మహాత్మా జ్యోతిభా ఫూలే బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం బాలుడు 9వ తరగతి చదువుతున్నాఉ. హాస్టల్‌లో చదువుతున్న రాజేష్ బుధవారం రాత్రి హాస్టల్‌లోని పాత మరుగుదొడ్ల సమీపంలోని రేకుల షెడ్డుకు ఉరివేసుకుని మృతి చెందాడు. గురువారం తెల్లవారు జామున తోటి విద్యార్థులు చూసి హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించారు. అయితే రాకేష్ మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. ఉరివేసుకోవడం చూసిన తల్లిదండ్రులు ఇది ఆత్మహత్య కాదని, కాళ్లు నేలపైనే ఉన్నాయని ఆరోపించారు. అయితే.. గణేష్ నిమజ్జనం సందర్భంగా బుధవారం పాఠశాల వదిలి కొందరు విద్యార్థులు గ్రామాలకు వెళ్లి డప్పులు కొట్టినట్లు సమాచారం. అయితే హాస్టల్ నుంచి బయటకు వెళ్లి డప్పులు కొట్టడంతో విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ లెక్చరర్ విద్యార్థులను తీవ్రంగా మందలించాడని కొందరు విద్యార్థులు పేర్కొంటున్నారు. మరికొందరు హాస్టల్‌ గదుల్లో అద్దెలు నిషేధించాలంటూ వార్డెన్‌ మందలించారని అంటున్నారు. ఈ కారణాలతోనే రాకేష్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి సంఘాలు ఆరోపించారు.

అంతేకాకుండా తమ కుమారుడి హత్యను, ఆత్మహత్యగా వార్డెన్ చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా… ఈ విషయం తెలుసుకున్న పీడీఎస్ యూ, ఎస్ ఎఫ్ ఐ, ఏఐఎస్ ఎఫ్ నాయకులు వచ్చి హాస్టల్ ఎదుట నిరసన తెలిపారు. పాఠశాల సిబ్బంది విద్యార్థులను దుర్భాషలాడారని, పైపులతో కొట్టారని తెలిపారు. పాఠశాలలో ఎంతో చురుగ్గా పనిచేసే రాకేష్ మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాకేష్ తండ్రి శారీరక వైకల్యంతో బాధపడుతున్నారని, తమది నిరుపేద కుటుంబమని, వారి కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ గురుకులాల్లో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాకేష్ మృతిపై విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను శాంతింపజేశారు. కాగా, గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి చెందడంతో తోటి విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ హాస్టల్‌లో ఉండలేమని తల్లిదండ్రులకు ఫోన్‌ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలను తీసుకెళ్తున్నారు. నాలుగు రోజుల పాటు పాఠశాలకు అనధికార సెలవులు ఇచ్చినట్లు సమాచారం.
Telangana Elections : తెలంగాణ హైటెక్‌ ప్రచారానికి సిద్ధమవుతున్న వాహనాలు..