Site icon NTV Telugu

Suicide Note: సూసైడ్‌ నోట్‌ రాసి.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Suicide Note

Suicide Note

Suicide Note: తన చావుకు ఉపాధ్యాయుడే కారణమంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఓ విధ్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పెద్దగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. ఆకాష్‌ ఓ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇంటర్‌ చదువుతున్నాడు. రోజూ లాగేనే తను కాలేజ్‌ కి వెళ్లాడు. క్లాస్‌ రూం లో సెల్‌ ఫోన్‌ చూస్తుండగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మాథ్స్‌ లెక్చర్‌ ఆ సెల్‌ని చూసాడు. అందులో ఓ విద్యార్థిని ఫోటో డీపీగా పెట్టుకోవడంతో మందలించాడు. తీసేయాలని అది కరెక్ట్‌ కాదని హెచ్చరించాడు. విద్యార్థి తీయక పోతే ఆ విషయాన్ని పెద్దలకు చెబుతానని చెప్పాడు. క్లాస్‌ రూంలో ఈ తతంగమంతా జరుగగా అవమానంగా భావించిన ఆకాష్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పెద్దలకు, పోలీసులకు చెప్తారేమో అనే భయం అతనిని వెంబడించింది.
అందరూ అడుగుతుండటంతో అవమానంగా భావించిన ఆకాష్‌. ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్‌ అయ్యాడు. ఆత్మహత్యకు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మాథ్స్ లెక్చరర్ కారణమంటూ సూసైడ్ నోట్ రాసాడు.

నిన్న సాయంత్రం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక సమాచారంతో.. కుటుంబ సభ్యులు, పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకి తీసారు. కాలేజీకి వెళ్లి తిరిగి వస్తాడన్న కొడుకు ఇలా బావిలో సవమై తేలడంతో.. తల్లిదండ్రుల ప్రాణాలు తల్లడిల్లాయి. బోరున ఏడుస్తూ కొడుకు గుండెకు హత్తుకుని కన్నీటి పర్వంతం అయ్యారు. తన ఆత్మహత్యకు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మాథ్స్ లెక్చరర్ కారణమంటూ సూసైడ్ నోట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తారని భయంతో ఆకాష్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Suryapet SP Rajendra Prasad : సూర్యాపేట ఎస్పీ అన్ని హద్దులు చెరిపేశారా..?

Exit mobile version