Site icon NTV Telugu

Etala Rajender: నాకు ఒక్కరక్తపు బొట్టు కారినా సీఎందే బాధ్యత

Etala Rajender

Etala Rajender

సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ ఫైర్‌ అయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో విచ్చలవిడిగా గన్‌ లైసెన్సులు ఇస్తున్నారని, తనకు గాని తన కుటుంబ సభ్యులకు గానీ ఒక్క రక్తపు బొట్టు కారినా దానికి భాధ్యత సీఎం కేసీఆర్‌దే అని ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. అంతేకాకుండా.. సీఎం కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజాభిప్రాయానికి రావాలని సవాల్‌ చేశారు. సీఎంను ఓడగొట్టే వరకు విశ్రమించేది లేదని అన్నారు. సీఎం కేసీఆర్‌ దుర్మార్గంగా వ్యహరిస్తున్నారని, ఆయన మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని విమర్శించారు.

ఈనేపథ్యంలోనూ.. అసెంబ్లీలో వాస్తవాలు మాట్లాడితే సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతోనే అకారణంగా తనను సభ నుంచి బయటికి పంపిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక.. అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి తనను ఇంటికి తీసుకెళ్లి హౌజ్‌ అరెస్టు చేశారని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ధ్వజమెత్తారు.. మరమనిషి అంటే సొంత అలోచన లేకుండా ఇతరులు చెప్పినట్టు చేసే వారని చెప్పారు. దీంతో.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పుడు కనీసం లేఖ కూడా తీసుకోకుండా అసెంబ్లీ స్పీకర్‌ అవమానపరిచారన్నారు. నేను మరమనిషి అన్నందుకే ఇంత బాధపడుతున్నారు.. గతంలో ప్రధాని మోదీని ఫాసిస్ట్‌, దద్దమ్మ, చవట అంటూ కేసీఆర్‌ అనుచితంగా మాట్లాడారని, దీనికి ఆయన క్షమాపణ చెప్పాలని.. తన సస్పెన్షన్‌పై న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్టు ఈటల చెప్పారు.
AP Assembly Live: ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Exit mobile version