Site icon NTV Telugu

Dogs Attack: నగరంలో మరో దారుణం.. కుక్కల దాడిలో చిన్నారి మృతి..!

Dogs Attaks

Dogs Attaks

Dogs Attack: ఇంటి ముందు ఆడుకుంటున్న రెండున్నరేళ్ల బాలికను వీధికుక్కలు దాడి చేసి చంపిన నగరంలో కలకలం రేపింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బిలాస్ పూర్ జిల్లా కొప్రా గ్రామానికి చెందిన విశ్వప్రసాద్, పుష్పబాయి దంపతులు సుచిత్ర సమీపంలోని బీమ్ కాలమ్స్ నిర్మాణ సంస్థలో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతను తన కుటుంబంతో కలిసి షీట్ షెడ్‌లో నివసిస్తున్నాడు. విశ్వప్రసాద్, పుష్పాబాయి శుక్రవారం పనికి వెళ్లారు. సాయంత్రం 4 గంటల సమయంలో తమ చిన్న కూతురు దీపాళి తోటి పిల్లలతో కలిసి షెడ్డు ముందు ఆడుకుంటుండగా.. అక్కడికి వచ్చిన రెండు కుక్కలు గొడవపడుతుండగా అక్కడే వున్న చిన్నారి దీపాళి కనిపించింది. దీంతో ఆ రెండుకుక్కలు దీపాళిపై దాడిచేశాయి.. బాలిక తల, చేతులకు తీవ్రగాయాలు చేసి కొద్దిదూరం ఈడ్చుకెళ్లాయి. ఈ రెండు కుక్కలకు మరో రెండు కుక్కలకు తోడయ్యాయి.

ఈ ఘటనను చూసిన మిగతా పిల్లలు భయంతో తల్లిదండ్రుల వద్దకు పరుగులు తీశారు. వెంటనే తల్లిదండ్రులు అక్కడికి రావడంతో కుక్కలు పారిపోయాయి. చిన్నారిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు నీలోఫర్ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. రాత్రి అక్కడికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అయితే వీధికుక్కలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దీపాళి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఘటనపై స్థానికులు అధికారులపై మండిపడుతున్నారు. వీధి కుక్కలు చిన్నారులపై దాడి చేస్తున్నా ఏ మాత్రం పట్టనట్లే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Ambedkar Jayanti: భారత రాజ్యాంగ పితామహుడు బీఆర్‌ అంబేడ్కర్‌ గురించి 10 ఆసక్తికర విషయాలు

Exit mobile version