Jagtial News: ఆర్టీసీ బస్సుపై రాళ్ల దాడి.. బస్సులో 75 మంది ప్రయాణికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stone pelting on RTC bus in Jagitya: జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
హుజురాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రోజూలాగానే తెల్లవారు జామున నిజామాబాద్ నుంచి వరంగల్ కు బయలు దేరింది. అందులో మొత్తం 75 మంది ప్రయాణికులు ఉన్నారు. సాఫీగా సాగుతున్న ప్రయాణంలో ఊహించని అపాయం ముంచుకొచ్చింది. జగిత్యాల మంచినీళ్లబావి సమీపానికి రాగానే ఒక్కసారిగా రాళ్లుతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెనుక నుంచి రాళ్లు విసరటంతో బస్సు అద్దాలు పగిలి మెట్‌పల్లికి చెందిన ఓ ప్రయాణికుడికి తీవ్రంగా గాయపడ్డాడు. బస్సులో 75 మందిప్రయాణిస్తున్నట్లు బస్సు కండక్టర్ తెలిపారు. బస్సు వెనుక నుంచి అనుసరిస్తున్న యువకులు దాడిచేసి పారిపోయారని కండక్టర్ పేర్కొన్నారు. డ్రైవర్, కండెక్టర్ అప్పమత్తమై బస్సును పక్కనే ఆపారని ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయని పేర్కొన్నారు. డ్రైవర్, కండక్టర్ పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. బస్సుపై రాళ్లదాడి చేసిన వ్యక్తి ఎవరు? మద్యం సేవించి రాళ్లదాడి చేశాడా? లేక బస్సులు వాళ్లకు సంబంధించిన వారిపై రాళ్లదాడి చేసి ఉంటాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Bhatti vikramarka: మహిళా సంఘాలకు భారీ మొత్తంలో వడ్డిలేని రుణాలు
Also Read
తాజావార్తలు
-
TVS Apache RTR 160 Price Hike: టీవీఎస్ Apache RTR 160 ధర పెంపు.. 2V, 4V కొత్త ధరలు, పూర్తి వివరాలు ఇవే!
-
World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
-
Keerthy Suresh : 41 గంటల నాన్-స్టాప్ షూటింగ్లో పాల్గొన్న కీర్తిసురేష్
-
iPhone 17 Pro Max: iPhone 18 రాకముందే iPhone 17 Pro Maxపై భారీ ఆఫర్.. రూ.16 వేల వరకు ఆదా!
-
Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!