Site icon NTV Telugu

Indian Railways: రైళ్లపై రాళ్లు విసిరతే ఐదేళ్ల జైలుశిక్ష.. దక్షిణ మధ్య రైల్వే హెచ్చరిక..

Indian Railways

Indian Railways

Indian Railways: ఇటీవల వందేభారత్ రైళ్లపై దాడులు ఎక్కువయ్యాయి. దేశంలోనే కాకుండా పలు ప్రాంతాల్లోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ వందేభారత్ రైలుపై అనేక దాడులు జరిగాయి. వందేభారత్ రైలుపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వందే భారత్ కోచ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అధికారులు వాటిని మార్చాల్సి వచ్చింది. దీంతో రైలును నిలిపివేయాల్సి రావడంతో ట్రాఫిక్‌కు కూడా అంతరాయం ఏర్పడింది. వందేభారత్ రైలుపై వరుస దాడుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అందులో భాగంగానే దాడికి పాల్పడిన వారిని హెచ్చరించారు. రైళ్లపై దాడులకు పాల్పడే నిందితులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, వారికి ఐదేళ్ల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం లేదా ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. కాజీపేట-ఖమ్మం, కాజీపేట-బొంగిర్, ఏలూరు-రాజమండ్రి వంటి సమస్యాత్మక సెక్షన్లలో వందేభారత్ రైళ్లపై దాడులు… ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 9 రైళ్లపై దాడులు జరిగాయి.

Read also: Gannavaram Airport: ఎయిరిండియా నిర్వాకం.. గన్నవరంలో ఇరుక్కుపోయిన కువైట్‌ ప్రయాణికులు..!

ఈ ఘటనల్లో 39 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. జనవరి నుంచి జరిగిన దాడుల్లో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. దాడి చేసిన వారిని ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా.. వందే భారత్ రైళ్లపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. కాగా.. ఆకతాయిలు రైళ్లపై రాళ్లు రువ్వుతున్నారు. గతంలో విశాఖపట్నంతో పాటు ఖమ్మం, రాజమండ్రి, ఏలూరు, కాజీపేట్, భువనగిరిలో ట్రైన్‌పై రాళ్ల దాడి జరిగింది. జనవరి 11న విశాఖపట్నం సమీపంలో కొందరు రాళ్లు రువ్వారు. ఫిబ్రవరిలో ఖమ్మం జిల్లాలో దాడి జరిగింది. విశాఖ జిల్లా కంచరపాలెంలో ఒకసారి వందేభారత్ రైలుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కోచ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. జనవరిలో సంక్రాంతి సందర్భంగా వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ రైలు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడుస్తుంది. ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ మరియు రాజమండ్రి రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. వందేభారత్ రాకతో సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం 9 గంటలకు తగ్గింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది.
foods to beat the heat: వేడిని అధిగమించడానికి ఈ ఆహారాలు తినండి

Exit mobile version