Site icon NTV Telugu

6 ఏళ్ళలో 60 వేల కోట్ల నష్టం జరిగింది

తెలంగాణ ధరణి పోర్టల్ లో అనేక సమస్యలు ఉన్నాయని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పట్టా భూమి కూడా నిషేధిత జాబితాలో ఉంది. దాదాపు 30 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉన్నట్టు సమాచారం ఉందని ఆయన తెలిపారు. ధరణిలో పట్టా ఉన్న భూములను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలన్నారు.

ధాన్యం కొనుగోలులో రైతులకు తూకంలో మోసం జరుగుతుందని అన్వేష్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి కోట్ల కుంభకోణం జరిగింది. మిల్లర్ల వద్ద తరుగు తీసి నాయకులు, అధికారులు కలిసి దోచుకున్నారు. ధాన్యం కొనుగోలులో పూర్తి విచారణ జరిపి నష్టపోయిన రైతులకు ఇవ్వాలి. ఇటీవల భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేల రూపాయలు ఇవ్వాలి. 6 ఏళ్ల నుంచి పంట నష్టాలు ఒక్కసారి కూడా ఇవ్వలేదు.. గత ఏడాది 12 వేల కోట్ల రూపాయలు పంట నష్టం జరిగింది. 6 ఏళ్ళలో ఏళ్ళలో 60 వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది. పంట రుణమాఫీ సరిగా చేయలేదు. రే షెడ్యూల్ అప్పులను కూడా రద్దు చెయ్యాలి. ఇంద్రవెళ్లి సభ తర్వాత జిల్లా వారీగా రైతులతో భారీ సభలు నిర్వహిస్తామని అన్వేష్ రెడ్డి తెలిపారు.

Exit mobile version