NTV Telugu Site icon

Srinivas Goud: వైన్స్ షాప్ ల్లో రిజర్వేషన్లు .. పదేళ్లలో ఎక్కడికో వెళ్ళిపోతాం

Srenivas Goud

Srenivas Goud

Srinivas Goud: తెలంగాణలో ఏం జరుగుతుందో చూస్తున్నారని, 10 సంవత్సరాల్లో ఎక్కడికో వెళ్ళిపోతామని, వైన్స్ షాప్ లలో రిజర్వేషన్లు దేశంలో ఎక్కడ లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులోని మినీ స్టేడియం ప్రారంభోత్సవంలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. సీతారామ ప్రాజెక్ట్ తరువాత దశ మారిపోయిందని అన్నారు. వ్యవసాయం, క్రీడలు అన్నింటిలో మార్పు వచ్చిందని తెలిపారు. గ్రామగ్రామాన ఉన్న ప్రగతి దేశంలో ఎక్కడ లేదన్నారు. కులం, మతం బేధం లేకుండా కేసీఆర్ పాలన ఉందని అన్నారు. ఎవరు మన వెంట ఉంటాడో, మన సమస్యలు పట్టించుకుంటాడో వాళ్ళను చూడాలని ప్రజలకు సూచించారు. తెలంగాణలో ఎం జరుగుతుందో చూస్తున్నారని అన్నారు. 10 సంవత్సరాల్లో ఎక్కడికో వెళ్ళిపోతామన్నారు. వైన్స్ షాప్ లలో రిజర్వేషన్లు దేశం లో ఎక్కడ లేదన్నారు. దళితుల కోసం, బిసి ల కోసం రిజర్వేషన్ లు ఏర్పాటు చేశామని ఎలక్షన్లలో అందరూ దిగుతారు.. డబ్బున్న వాళ్ళు కులం పేరుతో దిగుతారని వ్యంగాస్ర్తం వేశారు.

Read also: Minister KTR: నేడు ఐదు విప్లవాలను తీసుకొచ్చిన రాష్ట్రం తెలంగాణ

15,600 క్రీడా ప్రాంగణాలను రాష్ట్రం లో టార్గెట్ పెట్టుకున్నామన్నారు. క్రీడలకు పెద్దపీట వేస్తూ తెలంగాణ క్రీడాకారులను, క్రీడల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఏ సర్వేలో అయిన తెలంగాణ వస్తది అని తెలుస్తుందని హర్షం వ్యక్తం చేశారు. మన అవసరాలు కావాలో వాళ్ళ అవసరాలకు బలిపశువులు కావాలో ఆలోచన చేయాలని సూచించారు. తెలంగాణలో అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ది అవుతాయన్నారు. కామన్వెల్త్ లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో ఉందని గుర్తు చేశారు. సత్తుపల్లిలో కూడా నీర కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సర్వాయి పాపన్నను గుర్తించి,ప్రతి మండలంలో సర్వాయి పాపన్న విగ్రహాలను పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని తెలిపారు. అన్ని కులాలకు సంభందించిన వ్యక్తి సర్వాయి పాపన్న గౌడ్ అని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.
Unique Wedding : ఇద్దరికి న్యాయం చేసావా తల్లీ.. మొగుడితో 10 మంది కని, ఇప్పుడు ప్రియుడితో పెళ్లా?