Site icon NTV Telugu

TS Ministers: అనుకున్నట్టే జరిగింది.. ఐటీ ఆయనకే దక్కింది..

Daddulla Sridhar Babau

Daddulla Sridhar Babau

TS Ministers: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు శాఖలు కేటాయించారు. ఇవాళ రేవంత్‌తో పాటు 7 మంది సీఎంలు, మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా.. వారికి అప్పట్లో శాఖలు కేటాయించలేదు. డిసెంబరు 8న శాఖలు కేటాయించకుండానే సీఎం రేవంత్ తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్.. మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చించారు. నేడు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రులకు శాఖలు కేటాయించారు. అయితే ఎవరికీ కీలకమైన హోం శాఖను కేటాయించలేదు. మరో ఆరుగురికి మంత్రి వర్గంలో స్థానం కల్పించనున్నారు. మంత్రులకు శాఖలు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. హోం శాఖను పెండింగ్ లో పెట్టింది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ శాఖ ఎవరికీ కేటాయించబడలేదు. ఈ శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకుంటారని చర్చ జరుగుతోంది. విద్య, పశుసంవర్ధక, కార్మిక, పురపాలక, పట్టణాభివృద్ధి, సాధారణ పరిపాలన శాఖలను కూడా సీఎం పెండింగ్‌లో పెట్టారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత మిగిలిన వారికి ఈ శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

మంత్రులకు కేటాయించిన శాఖలు..

* మల్లు భట్టి విక్రమార్క – డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ
* ఉత్తమ్ కుమార్ రెడ్డి – పౌరసరఫరాల శాఖ, నీటి పారుదల శాఖ
* కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి- ఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫీ
* శ్రీధర్ బాబు- ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు
* పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి- రెవెన్యూ, హౌసింగ్, ఐ అండ్ పీఆర్ (సమాచార శాఖ)
* కొండా సురేఖ- అటవీ, దేవాదాయ శాఖ
* సీతక్క- పంచాయత్ రాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలు
* తుమ్మల నాగేశ్వరరావు- రైతు, చేనేత
* జూపల్లి- ఎక్సైజ్, టూరిజం
* పొన్నం రవాణా, బీసీ సంక్షేమ శాఖ
* దామోదర రాజనరసింహ- ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ

ఐటీ శాఖను ఎవరికి కేటాయిస్తారనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కేటీఆర్‌ ఆ శాఖను సమర్థంగా నిర్వహించగా.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముందుగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎల్లారెడ్డి పేట ఎమ్మెల్యే మదన్ మోహన్ పేర్లు తెరపైకి రాగా.. చివరకు ఐటీ మంత్రిగా శ్రీధర్ బాబుకు అవకాశం దక్కింది. అయితే అనుకున్నట్లే శ్రీధర్ బాబుకు ఐటీ మంత్రి పదివి వరించింది. ఇక సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలలో ఒకరికి హోంమంత్రి పదవి కేటాయిస్తారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే..

DeepFake: డీప్ ఫేక్ వీడియోలపై కేంద్రం సీరియస్.. రూల్స్ పాటించాల్సిందే !

Exit mobile version