TS Ministers: అనుకున్నట్టే జరిగింది.. ఐటీ ఆయనకే దక్కింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Ministers: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు శాఖలు కేటాయించారు. ఇవాళ రేవంత్‌తో పాటు 7 మంది సీఎంలు, మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా.. వారికి అప్పట్లో శాఖలు కేటాయించలేదు. డిసెంబరు 8న శాఖలు కేటాయించకుండానే సీఎం రేవంత్ తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్.. మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చించారు. నేడు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రులకు శాఖలు కేటాయించారు. అయితే ఎవరికీ కీలకమైన హోం శాఖను కేటాయించలేదు. మరో ఆరుగురికి మంత్రి వర్గంలో స్థానం కల్పించనున్నారు. మంత్రులకు శాఖలు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. హోం శాఖను పెండింగ్ లో పెట్టింది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ శాఖ ఎవరికీ కేటాయించబడలేదు. ఈ శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకుంటారని చర్చ జరుగుతోంది. విద్య, పశుసంవర్ధక, కార్మిక, పురపాలక, పట్టణాభివృద్ధి, సాధారణ పరిపాలన శాఖలను కూడా సీఎం పెండింగ్‌లో పెట్టారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత మిగిలిన వారికి ఈ శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
మంత్రులకు కేటాయించిన శాఖలు..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
* మల్లు భట్టి విక్రమార్క – డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ
* ఉత్తమ్ కుమార్ రెడ్డి – పౌరసరఫరాల శాఖ, నీటి పారుదల శాఖ
* కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి- ఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫీ
* శ్రీధర్ బాబు- ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు
* పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి- రెవెన్యూ, హౌసింగ్, ఐ అండ్ పీఆర్ (సమాచార శాఖ)
* కొండా సురేఖ- అటవీ, దేవాదాయ శాఖ
* సీతక్క- పంచాయత్ రాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలు
* తుమ్మల నాగేశ్వరరావు- రైతు, చేనేత
* జూపల్లి- ఎక్సైజ్, టూరిజం
* పొన్నం రవాణా, బీసీ సంక్షేమ శాఖ
* దామోదర రాజనరసింహ- ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ
ఐటీ శాఖను ఎవరికి కేటాయిస్తారనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ ఆ శాఖను సమర్థంగా నిర్వహించగా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముందుగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎల్లారెడ్డి పేట ఎమ్మెల్యే మదన్ మోహన్ పేర్లు తెరపైకి రాగా.. చివరకు ఐటీ మంత్రిగా శ్రీధర్ బాబుకు అవకాశం దక్కింది. అయితే అనుకున్నట్లే శ్రీధర్ బాబుకు ఐటీ మంత్రి పదివి వరించింది. ఇక సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలలో ఒకరికి హోంమంత్రి పదవి కేటాయిస్తారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే..
DeepFake: డీప్ ఫేక్ వీడియోలపై కేంద్రం సీరియస్.. రూల్స్ పాటించాల్సిందే !
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!