Site icon NTV Telugu

Special Trains : సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి స్పెషల్‌ ట్రైన్‌.. ఎప్పుడంటే..?

తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శించుకునేందకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే వారంతంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అయితే వివిధ ప్రాంతాల నుంచి వారాంతంలో తిరుపతికి వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

సెలవు రోజుల్లో అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, దక్షిణ మధ్య రైల్వే (SCR) ఏప్రిల్ 18న సికింద్రాబాద్ నుండి తిరుపతికి ప్రత్యేక రైలును నడపనుంది. సికింద్రాబాద్ నుండి ఏప్రిల్ 18వ తేదీన 07588 నెంబర్‌ గల రైలు సాయంత్రం 6.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైలు బేగంపేట, లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్, చిత్తాపూర్, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం ఈ రైలు ఏసీ టూ టైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్ క్లాస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను కలిగి ఉండనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Madhu Yashki Goud : రైతు సంఘర్షణ సభ పేరుతో రాహుల్ సభ

Exit mobile version