Site icon NTV Telugu

Telangana: విస్తరించిన రుతుపవనాలు.. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు

Rain1

Rain1

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో.. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిర్మల్‌ జిల్లా ముధోల్‌ 13.28 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. వరంగల్‌ జిల్లా నెక్కొండలో 12.75, భద్రాది కొత్తగూడెం జిల్లా మండలపల్లిలో 12.28, జగిత్యాల జిల్లా కొల్వాయిలో 11.90, మంచిర్యాల జిల్లా కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో 11.13 వర్షపాతం నమోదైంది.

జయశంకర్‌ జిల్లా ముత్తారం మహదేవ్‌పూర్‌లో 10.10,
పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లిలో 10 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.

రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో రాబోయే మూడు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని పేర్కొన్నది.

జిల్లాల్లో భారీ వర్షాలు
శుక్రవారం నాడు పెద్దపల్లి, జయశంకర్‌ భూపాల్‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

శనివారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

ఆదివారం మంచిర్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాల్‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్‌-మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాని తెలిపింది. ఈ మూడు రోజులు రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Mohan Bhagwat : రాముని స్ఫూర్తి, సీత శ్రద్ధ మన ప్రతి కార్యకర్తలో ఉంది

Exit mobile version