అటు సంప్రదాయాన్నీ, ఇటు ఆధునిక జీవనశైలినీ మేళవించి, అన్ని తరాల అభిరుచులనూ ప్రతిబింబించే సరికొత్త వస్త్ర జగత్తు – సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ 39వ షోరూమ్‌ను క్లాక్‌టవర్ సెంటర్, మహబూబ్‌నగర్‌లో 2025 ఫిబ్రవరి 1న వస్త్రప్రియుల కోసం ఆవిష్కరించింది! శ్రీ యెన్నం శ్రీనివాసరెడ్డి, మహబూబ్‌నగర్ శాసనసభ సభ్యులు; శ్రీ లక్ష్మణ్ యాదవ్, ఛైర్మన్, మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ; శ్రీ ఆనంద్‌గౌడ్, మునిసిపల్ ఛైర్మన్, మహబూబ్‌నగర్; శ్రీ షబ్బీర్ అహ్మద్, మునిసిపల్ వైస్‌ఛైర్మన్, మహబూబ్‌నగర్; శ్రీ లక్ష్మణ్, మునిసిపల్ వార్డ్ కౌన్సిలర్, మహబూబ్‌నగర్ ముఖ్యఅతిథులుగా విచ్చేసి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి 39వ షోరూమ్‌ను శుభారంభం చేశారు.
ప్రముఖ సినీతార కుమారి ఊర్వశి రౌతేలా (డాకు మహారాజ్ ఫేమ్) గారు జ్యోతి ప్రజ్వలన చేసి, సరికొత్త షోరూమ్‌కు శుభారంభం చేశారు. ఈ విశేష కార్యక్రమం కలకాలం గుర్తుండిపోయేలా, వస్త్రప్రియులు ఆనందించేలా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు తమ ప్రత్యేకతను చాటి చెప్పారు. విస్తారమైన ఈ షోరూమ్- సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ బ్రాండ్ తాలూకు అంకితభావానికి, ప్రత్యేకతకు గుర్తుగా కొనుగోలుదారులను అలరిస్తోంది. రాబోయే వివాహాది శుభకార్యాలను దృష్టిలో ఉంచుకుని అన్ని తరాలను, తరగతులను అలరించే లక్షలాది వైవిధ్యభరిత వస్త్రశ్రేణి ఇక్కడ అందుబాటులో ఉండటం విశేషం.
ఈ శుభ సందర్భాన్ని ప్రతిబింబిస్తూ, స్థానికులకు సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ సంస్థ డైరెక్టర్లు శ్రీ సురేశ్ సీర్ణ, శ్రీ అభినయ్, శ్రీ రాకేశ్, శ్రీ కేశవ్ గార్లు స్వాగతం పలికారు. అదే సమయంలో మహబూబ్‌నగర్ పరిసర ప్రాంత వస్త్రప్రియుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని విశేష సేవలు అందిస్తున్న సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ వారి అంకిత భావాన్ని ప్రశంసిస్తున్న కొనుగోలుదారులందరికీ సంస్థ డైరెక్టర్లు తమ హృదయపూర్వక కృతజ్ఞతలను, సంతోషాన్నీ వ్యక్తం చేశారు.
సంస్థ డైరెక్టర్ శ్రీ సురేశ్ శీర్ణ మాట్లాడుతూ, ‘‘మహబూబ్‌నగర్‌లో మా సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ 39వ షోరూమ్‌ను శుభారంభం చేయడం మాకెంతో ఆనందదాయకం. మహబూబ్‌నగర్‌వాసులు కోరుకునే నాణ్యతకు, నవ్యత్వానికీ పెద్దపీట వేసి, వారి అభిరుచులను అడుగడుగునా ప్రతిబింబించే వైవిధ్యభరిత వస్త్రశ్రేణిని, షాపింగ్ అనుభూతిని ఒకేచోటకు తీసుకురావటం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాం’’ అన్నారు.
సంస్థ మరో డైరెక్టర్ శ్రీ అభినయ్ మాట్లాడుతూ- ‘‘రాబోయే వివాహాది శుభకార్యాలకు, భారతీయ సంప్రదాయ కలెక్షన్లకు తమ షోరూమ్ విశేషమైన కేంద్రంగా, ఆకర్షణీయ షాపింగ్ గమ్యస్థానంగా కొనుగోలుదారులు తప్పక అభిమానిస్తారని’’ అన్నారు. అదేవిధంగా ప్రారంభోత్సవ సందర్భంగా షోరూమ్ వారు ఇస్తున్న ‘కాస్ట్-టు-కాస్ట్’ అమ్మకాలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. స్థానిక వస్త్రాభిమానులను స్వాగతిస్తూ మరో డైరెక్టర్ శ్రీ రాకేశ్, ‘‘మహబూబ్‌నగర్‌లోనే అతిపెద్ద షోరూమైన మన సౌత్ ఇండియా షాపింగ్‌మాల్‌లో అన్నిరకాల వస్త్రాలు- ధరలోనూ, నాణ్యతలోనూ, వస్త్రప్రియుల అభిరుచులను ప్రతిబింబిస్తూ, వారిని అలరించడంలో తమదైన ప్రత్యేకతను కలిగిఉన్నాయి. ముఖ్యంగా అన్నిరకాల ఆదాయవర్గాల వారికీ అందుబాటులో ఉండటం వీటి ప్రత్యేకత’’ అన్నారు.
సంస్థకు చెందిన ఇంకో డైరెక్టర్ శ్రీ కేశవ్ మాట్లాడుతూ, ‘‘వైవిధ్యభరితమైన వస్త్రాలను కోరుకునే వారి కోసం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 39వ షోరూమ్‌ను శుభారంభం చేయటం మాకు గర్వకారణం, ఆనందకరం. స్థానిక కొనుగోలుదారుల నుంచి లభిస్తున్న ప్రోత్సాహం సంతోషదాయకం. వారు కోరుకునే ప్రతి వెరైటీని అందించేందుకు మేము ఆసక్తితో ఎదురు చూస్తున్నాం’’ అన్నారు. ఈ పెళ్లిసీజన్‌లో మీరు అద్భుతంగా కనిపించేందుకు అత్యుత్తమ కలెక్షన్స్ మేము సిద్ధం చేశాం. ముఖ్యంగా పెళ్ళికుమార్తెల కోసం మా వద్ద ఉన్న అద్భుతమైన ప్రత్యేక మగ్గాలపై చేసిన పట్టుచీరల కళాత్మకమైన పనితనాన్ని చూడాల్సిందే.
జీవితంలో గుర్తుండిపోయే మధుర క్షణాల కోసం వాటిని మీరు సరసమైన ధరలకు సొంతం చేసుకుంటారు. అలాగే పెళ్లికుమారుల కోసం మావద్దనున్న ఎత్నిక్‌వేర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే పెళ్లికి వచ్చే అతిథుల కోసం స్పెషల్ కలెక్షన్స్‌తో పాటు పెట్టుబడి చీరలు మా ప్రత్యేకత. మరి ఆలస్యం దేనికి? వెంటనే మా వద్దకు విచ్చేయండి. మనోహరమైన దుస్తుల్లో మంగళవాద్యాల నేపథ్యాన్ని సుసంపన్నం చేసుకోండి.
క్లాక్‌టవర్ సెంటర్, మహబూబ్‌నగర్‌లో అనేక ప్రత్యేకతలు కలిగిన సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ వారి ఈ 39వ షోరూమ్‌ను సందర్శించిన ప్రతి ఒక్కరూ- సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ తమ శాఖలను విస్తరించటంతో బాటుగా రీటైల్ రంగంలో ధర, నాణ్యతలకు సంబంధించిన సరికొత్త, సమున్నత ప్రమాణాలను సైతం పెంపొందిస్తూ, నేతృత్వ లక్షణాలతో అగ్రగామిగా నిలుస్తోందని. రాబోయే వివాహాది శుభాకార్యాలకు వస్త్రాభిమానులకు ఇది వినూత్న గమ్యం కాగలదని ప్రశంసించారు.