Site icon NTV Telugu

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్, ఏకంగా 20 రైళ్లు రద్దు..!

South Central Railway

South Central Railway

Trains Cancelled: సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ డివిజన్లలో వారం రోజులుగా పలు రైళ్లను రద్దు చేశారు. నిర్వహణ పనుల కారణంగా రెండు డివిజన్లలో అనేక ప్యాసింజర్, MMTS రైళ్లు రద్దు చేయబడ్డాయి. మరికొన్ని రైళ్లు పాక్షికంగా నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా 20 ప్యాసింజర్ రైళ్లతో పాటు 22 ఎంఎంటీఎస్ రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు 18 రైళ్లు, 15 నుంచి 21వ తేదీ వరకు రెండు రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. ఈ సందర్భంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

రద్దు చేయబడిన వాటిలో కాజీపేట- డోర్నకల్ (07753), డోర్నకల్- కాజీపేట (07754), డోర్నకల్- విజయవాడ (07755), విజయవాడ- డోర్నకల్ (07756), భద్రాచలం రోడ్- విజయవాడ (07278), విజయవాడ- భద్రాచలం రోడ్ (0799). అలాగే కాజీపేట – సిర్పూర్‌టౌన్ (17003), బల్లార్ష – కాజీపేట (17004), సిర్పూర్‌టౌన్ – భద్రాచలం రోడ్ (17034), సికింద్రాబాద్ – వరంగల్ (07462), వరంగల్ – హైదరాబాద్ (07463), సిర్పూర్‌టౌన్‌- కరీంనగర్‌ (07766), కరీంనగర్‌- నిజామాబాద్‌ (07893), కాజీపేట – బల్లార్ష (17035), కాచిగూడ – నిజామాబాద్ (07596), నిజామాబాద్ – కాచిగూడ (07593) రైళ్లు రద్దు చేయబడ్డాయి. భద్రాచలంరోడ్- బల్లార్ష (17033), బలార్ష-కాజీపేట (17036), కరీంనగర్- సిర్పూర్ టౌన్ (07765), నిజామాబాద్- కరీంనగర్ (07894) రైళ్లు రద్దు చేయబడ్డాయి. ఈ రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వీటితో పాటు హైదరాబాద్‌లో 14 నుంచి 20వ తేదీ వరకు 22 ఎంఎంటీఎస్ రైళ్లను కూడా రద్దు చేశారు.

12 ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వచ్చే వారం వివిధ ప్రాంతాల నుంచి 12 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 13, 14 తేదీల్లో తిరుపతి – కాకినాడ టౌన్ (07063), నర్సాపూర్ – తిరుపతి (07061), కాకినాడ టౌన్ – తిరుపతి (07064), తిరుపతి – నర్సాపూర్ (07062), కాచిగూడ – విల్లుపురం (07424), ఆగస్టు 15న విల్లుపురం – కాచిగూడ (07425), 16న కాచిగూడ-కాకినాడ టౌన్ (07039), 17న కాకినాడటౌన్-కాచిగూడ (17040), దక్షిణ మధ్య రైల్వే అధికారులు సమాచారం అందించారు.
Telangana Rains: తెలంగాణలో వర్షాలకు ఛాన్స్.. వచ్చే మూడ్రోజులు కురిసే అవకాశం

Exit mobile version