NTV Telugu Site icon

Harish Rao: గుడ్ న్యూస్.. త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేస్తాం

Harsih Rao

Harsih Rao

త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. సంగారెడ్డి పట్టణంలో కొత్త పింఛనుదారులకు మంత్రి హరీశ్‌ రావు స్మార్టు కార్డులు పంపిణీ చేశారు. గ్రూప్ 4 నోటిఫికేషన్ తో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పేదలను మా ప్రభుత్వం కాపాడుకుంటుందని హరీష్‌ రావ్‌ అన్నారు. దేశంలో ఎక్కడ కూడా 2016 రూపాయల పెన్షన్లు ఇస్తలేరని అన్నారు. ఢిల్లీలో బీజేపీ ఉచితాలు బీజేపీ బంద్ చేయమంటుందని, ఏది ఉచితం ఏది అనుచితం అంటూ ప్రశ్నించారు. మీరు బడా బడా నేతలకు రుణ మాఫీ చేశారని ఎద్దేవ చేశారు.

కేంద్ర సర్కార్‌ అన్నింటి ధరలు పెంచి పేదలపై భారం మోపిందన్నారు. 400 ఉన్న సిలిండర్ 1200 చేశారని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్రం చెప్పిందని అన్నారు. అంటే 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని గుర్తుచేశారు. ఉద్యోగాలు ఇచ్చుడేమో కానీ ఉన్న ఉద్యోగాలు ఉడిపోయాయని ఎద్దేవ చేశారు. ఇంటి అడుగు జాగా ఉంటే 3 లక్షల రూపాయలు దసరాలోపు సహాయం చేస్తామన్నారు. ఆనాడు 20 లక్షల మందికి పెన్షన్లు ఇస్తుంటే.. ఇప్పుడు తెలంగాణలో 45 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని హరీశ్‌ అన్నారు.
Central Government: రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త.. ఆ నిధులు విడుదల.. ఏపీ, తెలంగాణకు ఇలా..