NTV Telugu Site icon

Rangareddy Crime: దారుణం.. 20 రూపాయల కోసం కన్నతల్లినే కిరాతకంగా చంపిన కొడుకు..

Rangareddy Crime

Rangareddy Crime

Rangareddy Crime: ఈ భూమిపై వెలకట్టలేనిది అమ్మ ప్రేమ. నిస్వార్థ ప్రేమ తల్లి మాత్రమే. ఆ మాతృమూర్తి.. తన పిల్లలను ఏ కష్టం లేకుండా పెంచి పెద్ద చేస్తుంది. కన్న తల్లి ప్రేమను మర్చి.. దారుణానికి ఓడిగడుతున్నారు. కొందరైతే.. డబ్బు కోసం తల్లులను హత్య చేస్తున్నారు. మరికొందరు డబ్బు కోసం కొడుకుల తల్లిదండ్రులను చిత్రహింసలకు గురిచేస్తూ నరకం చూపిస్తున్నారు. ఇక.. చిన్నప్పటి నుంచి తనకు సేవ చేసిన తల్లి వృద్ధాప్యంలో సేవ చేయడం మానేసి.. దారుణంగా హత్య చేసిన ఘటనలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారుతున్నాయా అనే సందేహం కలుగుతోంది. ప్రాణాలను పణంగా పెట్టి ప్రసవించిన తల్లిపై కొందరు కొడుకులు దాడి చేస్తున్నారు. ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్-కేశంపేటలో జరిగింది.

Read also: Ayodhya Ram Mandir: అయోధ్యలో రామయ్య ఊరేగింపు రద్దు.. కారణం ఏంటంటే?

షాద్ నగర్‌లో సుగుణమ్మ అనే మహిళ నివసిస్తోంది. స్థానికంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమెకు శివకుమార్ అనే కుమారుడు ఉన్నాడు. డబ్బుల కోసం తల్లిని..శివకుమార్‌ను తరచూ వేధించేవాడు. అదేవిధంగా ఆదివారం రాత్రి కూడా రూ.20 డబ్బుల కోసం శివకుమార్ తల్లి సుగుణమ్మతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో కొడుకు విచక్షణ సహనం కోల్పోయి తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో తల్లిపై దాడికి పాల్పడ్డాడు. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అక్కడే వున్న వారు వద్దు ఆమె నీకు తల్లి తనపై అలా దురుసుగా ప్రవర్తించడం సరికాదని చెబుతున్నా.. శివకుమార్ చెవిన వేసుకోలేదు. కొడుకు ఆమెను దారుణంగా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను తన చీరతోనే మెడకు గట్టిగా బిగించాడు. ఊపిరి ఆడకుండా చేశాడు. దీంతో ఆమె సృహ కోల్పోయింది. అయితే తెల్లవారుజామున సుగుణమ్మ మృతి చెందింది. ఇది చూసిన నిందితుడు తన తల్లి అనారోగ్యంతో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.
Sri Krishna Janmabhoomi: నేడు శ్రీ కృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ