NTV Telugu Site icon

Karimnagar Crime: తండ్రిపై కొడుకు దాడి.. బ్యాట్ తో కిరాతకంగా కొట్టి..

Karimnagar Crime

Karimnagar Crime

Karimnagar Crime: ముసలి తనంలో తనకు తోడుగా ఉంటాడనే చిన్న ఆశ. కన్న కొడుకును చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి. అతని కోసం కష్టాలు పడి అప్పులు తెచ్చి కొడుకు మంచి ఉద్యోగం సంపాదించేంత వరకు తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు వచ్చిన ఆనందంలో కన్న కొడుకు ఎదుగుదలను చూసేందుకు ఒక్కపూట అన్నం తిని బతికి తన కొడుకు మూడు పూటలా తింటే చాలనుకుంటారు. అలాంటి తల్లిదండ్రులపై కన్న బిడ్డలే దాడి చేస్తూ వారి మరణానికి కారణమవుతున్నారు. ఇలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

Read also: Suspicious Death : పొలం కోసం గుళ్లో నిద్ర.. తెల్లారే సరికి రక్తపు మడుగులో..

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలోఅట్టికం శంకరయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతనికి అట్టికం రవికుమార్ అనే కొడుకు ఉన్నాడు. అయితే వీరి మధ్య తరచూ ఆస్తి కోసం రోజూ తండ్రిపై కొడుకు గొడవకు దిగేవాడు. అయితే ఆస్తి ఇచ్చేదే లేదని తండ్రి చెప్పడంతో కొడుకు, తండ్రిపై ఆవేశం పెంచుకున్నాడు. ఎలాగైనా ఆస్తి దక్కించుకునేందుకు తండ్రినే కడతేర్చాలని ప్లాన్‌ వేశాడు. పథకం ప్రకారం తండ్రి ఇంట్లో ఉండటం చూసి ఇంటికి వెల్లిన ఒకడుకు అట్టికం రవికుమార్‌ ఆస్తిపై ప్రస్తావించాడు. తండ్రి అట్టికం శంకరయ్య నువ్వు ఎన్ని సార్లు అడిగినా నా ప్రాణం పోయేంత వరకు ఆస్తి మాట ఎత్తకూడదని కరాఖండిగా చెప్పాడు. మాట మాట పెరిగి గాలివానైంది. ఇక ఆవేశంలో రవి తండ్రిపై అక్కడే ఉన్న క్రికెట్‌ బ్యాట్‌ తో విచక్షణా రహితంగా దాడి చేశాడు. తండ్రి శంకరయ్య కట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకుని శంకరయ్యను ఆసుపత్రికి తరలించే యత్నంలో మార్గం మధ్యలోనే శంకరయ్య ప్రాణాలు వదిలాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు రవిని అదుపులో తీసుకున్నారు. విచారణ చేపట్టారు.
Viral : బస్తా చిల్లర పెట్టి బండి కొన్నాడు

Show comments