NTV Telugu Site icon

Somesh Kumar: సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందే.. హైకోర్టు ఆదేశం

Somesh Kumar

Somesh Kumar

Somesh Kumar: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ ఇబ్బందుల్లో పడ్డారు. ఆయనను ఏపీ క్యాడర్‌కు పంపాల్సిందేనని హైకోర్టులో ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేసింది. సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర విభజనప్పుడు సోమేష్ కుమార్ ను కేంద్రం ఏపీకి కేటాయించిన విసయం తెలిసిందే.. కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో సోమేష్ కుమార్ తెలంగాణలో కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పు వాదనలు వినిపించారు. సోమేష్ కుమార్ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలు 3 వారాలు నిలిపివేశారు. అయితే.. తెలంగాణ హైకోర్టులో సీఎస్ సోమేశ్ కుమార్ కు చుక్కెదురైంది. డీఓపీటీ పిటిషన్ పై హైకోర్టు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. సోమేశ్ కుమార్ ఏపీకు వెళ్లిపోవాలని హై కోర్టు ఆదేశించింది. సోమేశ్ కుమార్ కౌన్సిల్ సమయం కోరింది. సోమేశ్ కుమార్ తరపు న్యాయవాది అప్పీల్ కు సమయం కోరింది. సమయం ఇచ్చేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే హైకోర్టు నిర్ణయంతో సోమేశ్‌ కుమారు ఏపీకి వెళతారా? లేక సుప్రీం కోర్టుకు ఆశ్రయిస్తారా? అనేది చర్చ జరుగుతుంది.

Read also: Veera Simha Reddy: యాడజూడు నీదే జోరు.. మొగతాంది నీదే పేరు

అయితే.. ఏపీ క్యాడర్‌కు కేటాయించినప్పటికీ ఆయన తెలంగాణలోనే విధులు నిర్వహిస్తూండటంపై దాఖలైన పిటిషన్ విషయంలో హైకోర్టు విచారణ జరిపింది. ఇక.. కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన ఏపీకి వెళ్లాల్సిందేనన్న వాదన వినిపించింది. దీనిపై హైకోర్టులో కేంద్రం స్పష్టమైన అభిప్రాయం చెప్పింది. కాగా.. ఆయన ఏపీకి పంపాల్సిందేనని తెలిపింది. ఈనేపథ్యంలో.. ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి..హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. అయితే తీర్పు రాక ముందే ఆయనపై బదిలీ వేటు పడే అవకాశం ఉందని అధికారవర్గాల్లో ప్రచారం జరుగింది. ఇక.. కేంద్రం కూడా స్పష్టంగా తన అభిప్రాయం చెప్పినందున సోమేష్ కు షాక్ తగలడం ఖాయమని భావించారు. కాగా..సోమేష్ కుమార్‌ను విభజన సమయంలో ఏపీ క్యాడర్‌కు కేటాయించారు. అయితే.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్‌కు వెళ్లి స్టే తెచ్చుకున్న ఆయన తెలంగాణ సర్వీస్‌లోనే కొనసాగుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయనకు తెలంగాణలో చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు ఇచ్చారు. ఈనేపథ్యంలో.. సోమేశ్‌ కుమార్‌ తీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. న్యాయవ్యవస్థకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం కేసీఆర్‌ సీఎస్‌ను ఆదేశించారని పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Show comments