Site icon NTV Telugu

Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత.. ప్రత్యర్థి కుటుంబంపై ట్రాక్టర్‌తో దాడి

Kamareddy

Kamareddy

Kamareddy: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్‌పేట గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పాపయ్య విజయం సాధించిన వెంటనే, ఆయన సోదరుడు చిరంజీవి గ్రామంలో వీరంగం సృష్టించాడు. తమపైనే పోటీ చేశారనే కక్షతో చిరంజీవి ప్రత్యర్థి అభ్యర్థి రాజు కుటుంబంపై ఏకంగా ట్రాక్టర్‌తో దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటనలో బాలమణి, భారతి, సత్తవ్వ, శారదలకు తీవ్ర గాయాలయ్యాయి, వారి పరిస్థితి విషమంగా ఉండటంతో తక్షణమే హైదరాబాద్‌కు తరలించారు.

Palnadu District: నల్లగా ఉందని వదిలేసిన భర్త.. అత్త ఇంటి ముందు ఆందోళనకు దిగిన భార్య

ఈ అమానుష దాడికి నిరసనగా బాధితులు, గ్రామస్థులు ఎల్లారెడ్డిలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ దాడికి వ్యతిరేకంగా గ్రామస్థులంతా ఏకమై ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కురుమ సాయిబాబా రాజీనామా చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ, ఎల్లారెడ్డి-బాన్సవాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రస్తుతం సోమార్పేట గ్రామంలో పోలీసులు భారీగా మోహరించి పికెటింగ్ ఏర్పాటు చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సర్పంచ్ పదవికి రాజీనామా చేయించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు, దీంతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతోంది.

IPL 2026 Auction: ఫ్రాంచైజీల టాప్ పిక్స్‌ వీరే.. ఈ అన్‌క్యాప్‌డ్ ఇండియన్ ప్లేయర్లపై కాసుల వర్షమే!

Exit mobile version