NTV Telugu Site icon

తెల్లాపూర్‌లో విషాదం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కుటుంబం ఆత్మహత్య

తెల్లాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది.. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌ విద్యుత్‌ నగర్‌లో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది… భార్య, భర్త ఇద్దరు పిల్లలు సహా నలుగురు మృతిచెందారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న విద్యుత్ నగర్ లో చంద్రకాంత రావు అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆయనకు గత కొంతకాలంగా భార్యతో తరచూ గొడవలు జరుగుతున్నట్టుగా చెబుతున్నారు.. తాజాగా మరోసారి గొడవ కావడంతో భార్య బయటికి వెళ్లిపోయింది… దీంతో మనస్తాపం చెందిన చంద్రకాంత రావు .. బీహెచ్‌ఈఎల్‌లో ఆత్మహత్య చేసుకోగా… భర్త ఉరివేసుకున్న సమాచారం భార్యకు తెలియడంతో.. ఇద్దరు పిల్లలతో కలిసి జోగిపేట ఆందోల్ చెరువులో దూకి భార్య కూడా ఆత్మహత్య చేసుకుంది.. దీనికి కారణం అప్పులుగా తెలుస్తోంది.. తరచూ భర్త అప్పులు చేయడంతో.. అసలు ఎందుకు అప్పులు చేస్తున్నావు అంటూ భార్య నిలదీయడంతో.. గొడవ జరిగిందని.. అదే ఆత్మహత్యలకు దారి తీసినట్టు చెబుతున్నారు స్థానికులు. మొత్తంగా భార్యాభర్తల మధ్య గొడవ నాలుగు ప్రాణాలను తీసింది. దీంతో.. తెల్లాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది.

Read Also: పీఆర్సీపై గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం జగన్

బీహెచ్‌ఈఎల్‌లో చంద్రకాంత రావు ప్రాణాలు వదిలితే.. భార్య లావణ్య తన కొడుకు ప్రితమ్ (9), కూతురు సర్వజ్ఞ (1 1/2)తో కలిసి ఆందోల్ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.. అయితే, ఈ మధ్య చంద్రకాంత బ్యాంక్ లో లోన్ తీసుకొని BHEL వద్ద గల బీరంగూడ వద్ద ఓ అపార్ట్మెంట్ కొనుగోలు చేశాడు.. బ్యాంక్ రుణం కట్టలేక ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని చెబుతున్నారు.. చంద్రకాంత రావు.. టీసీఎస్‌ ఆదిభట్లలో పనిచేస్తున్నాడు. మృతుడి తండ్రి నాగేశ్వరరావు రిటైర్డ్ BHEL ఉద్యోగి. గత సంవత్సరం నుండి తండ్రితో గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.. ఆర్థికంగా సహాయం చేయాలని తండ్రిని మృతుడు చంద్రకాంత్ రావు కోరాడని తెలుస్తుండగా.. తన వాటలోని 6 ఎకరాల భూమి నుండి 2 ఎకరాలు అమ్మి అప్పులు తీర్చేందుకు ప్రయత్నం చేయడం.. దానికి తండ్రి నిరాకరించడంతో మనస్తాపానికి గురైనట్టుగా చెబుతున్నారు.. మరోవైపు, కూతురు, అల్లుడి బాధలు చూడలేక అల్లుడికి 30 లక్షలు ఆర్థిక సహాయం చేశాడయట.. మృతురాలి తండ్రి.. అయినా, వారి ప్రాణాలు తీసుకున్ఆరు. మృతురాలు లావణ్య స్వగ్రామం కామారెడ్డి జిల్లా చిట్యాల గ్రామం కాగా.. మృతుడు చంద్రకాంత్ రావు స్వగ్రామం జహీరాబాద్ వద్ద ఉన్న గార్లపల్లి గ్రామం.. అయితే, గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి BHEL లో స్థిరపడ్డారు.