NTV Telugu Site icon

Terrible in nursing: నార్సింగ్ లో దారుణం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య..

Terrible In Nursing

Terrible In Nursing

Terrible in nursing: సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఉద్యోగాలు ఉండొచ్చు ఊడొచ్చు. ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందో అంటూ సాప్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు టెక్సన్ మొదలైంది. ఓవైపు పని ఒత్తిడి, మరో వైపు ఉద్యోగం ఉంటుందా లేదా అనే ప్రశ్నలు. ఇప్పుడున్న ఉద్యోగం పోతే ఎలా బతకాలంటూ భయాందోళన చెందుతున్నారు. కుటుంబాన్ని ఎలా పోషించాలని కలత చెందుతున్నారు. దీంతో సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు బలవత్మరణాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగం ఉంటుందో ఉండదో.. ఒకవేల ఉద్యోగం ఊడితే మా పరిస్థితి కుటుంబ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించుకుంటూ ఆవేదనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే నార్సింగ్‌లో చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం రేపింది.

Read also: Indore temple accident : ఇండోర్ ఆలయ ప్రమాదంలో 36కు చేరుకున్న మృతుల సంఖ్య

రంగారెడ్డి జిల్లా నార్సింగీలోని పుప్పాల్ గూడలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గుంటూరు జిల్లాకు చెందిన వినోద్ కుమార్ హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పని చేస్తున్నాడు. గత ఐదు సంవత్సరాల క్రితం వినోద్ కుమార్ వివాహం జరిగింది. వినోద్ కుమార్ కు ఓ బాబు కూడా ఉన్నాడు. పలు సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఉద్యోగాలు కోల్పోతున్న ఇంజనీర్లు అంటూ రోజూ వస్తున్న వార్తలతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు వినోద్‌. దీంతో తన ఉద్యోగం కూడా పోతుందని తీవ్ర ఆందోళన చెందిన వినోద్‌.. తీవ్ర మనస్తాపంతో గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గదిలో నుండి ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో అన్న రాజేష్ కుమార్ గది తలుపులు పగలగొట్టడంతో షాక్‌కు గురయ్యారు. ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించిన తమ్ముడిని చూసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులకు ఫోన్ చేసి విషయాన్ని అన్న రాజేష్‌ చెప్పడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Foreign currency: చెన్నై, కొచ్చి విమానాశ్రయాల్లో విదేశీ కరెన్సీ, బంగారం పట్టుకున్న అధికారులు