Site icon NTV Telugu

Hyderabad Crime: మరో మహిళతో భర్త.. ఫేస్‌బుక్‌ లో లైవ్‌ పెట్టి భార్య ఆత్మహత్య

Hyderabad Crime

Hyderabad Crime

Hyderabad Crime: ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. పెళ్లయిన భార్య, భర్తలు వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజూ పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. అయితే.. సామాన్య ప్రజలే కాదు సమాజంలో ఉన్నంత స్థాయి వారు కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. అదిచూసి భరించలేని వారు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో నాచారంలో కలకలం రేపుతుంది.

హైదరాబాద్ నాచారంలో సనా అనే మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఓ కంపెనీ విధులు నిర్వహిస్తుంది. కొద్ది రోజుల క్రితం తనకు నాచారంకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే భర్త వేరొక మహిళతో వివాహేత సంబంది కొనసాగిస్తున్నట్లు తెలియడంతో ఆమె సహించలేకపోయింది. ఈ విషయమై భర్తకు చెప్పిన వినిపించుకోలేదు. ఈ క్రమంలో సన, ఆమె భర్తల మధ్య విబేధాలు కొనసాగాయి. వేరే మహిళతో ఉండటం సహించలేని సన ఆత్మహత్య చేసుకునేందుకు సిద్దమైంది. ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది. సనా ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సనా ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు హైదరాబాద్ నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న యువతి పాత స్నేహితుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసింది. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య చాటింగ్ కొనసాగింది. ఈ నేపథ్యంలో ప్రతాప్ వ్యక్తిగత ఫొటోలు అడగగా.. యువతి కూడా అభ్యంతరం చెప్పకుండా పంపించింది. ఆమె ఫోటోలు రాగానే ప్రతాప్ అసలు స్వరూపం బయటపెట్టాడు. ఆ ఫోటోలతో ప్రతాప్ బ్లాక్ చేస్తూ ఆమెను వేధించాడు. తాను చెప్పేది వినాలనే కోరిక తీర్చమని పదే పదే బ్లాక్ చేశౄడు. అతడి వేధింపులు భరించలేక యువతి ప్రతాప్ ఫోన్ నంబర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ను బ్లాక్ చేసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రతాప్.. ఆ యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యులకు పోస్ట్ చేశాడు. దీంతో బాధితయువతి రాచకొండ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. బాలికను వేధిస్తున్న వ్యక్తి యూపీకి చెందిన ప్రతాప్‌గా గుర్తించి అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.
Weight Loss Mistakes: పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. బరువు తగ్గకపోగా పెరుగుతారు!

Exit mobile version