Software Employee Killed: అప్పు ఇచ్చి ఆదుకున్నాడు.. మళ్లీ తిరిగి ఆ ఆప్పుఅడుగుతున్నాడనే కక్షతో అతడిని దారుణంగా హత్య చేయించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో చోటుచేసుకుంది. ముత్యాలంపాడు క్రాస్‌రోడ్డు పంచాయతీలోని శాంతినగర్ కు చెందిన బీజేపీ మండల అద్యక్షుడు ధారావత్ బాలాజీ పెద్ద కుమారుడు ధారావత్ అశోక్ కుమార్ ఖమ్మంలోని ఐటీ కంపెనీలో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అశోక్ కు భార్య అమల, రెండు నెలల పాప ఉంది. ఆన్యోన్యంగా సాగుతున్న వీరి జీవితంలో అప్పు ఇవ్వడమే శాపమైంది. ముత్యాలంపాడు క్రాస్ రోడ్ కు చెందిన గుగులోత్ ప్రేమ్ కుమార్ రూ.80వేల వరకు బాకీ ఉన్నట్లు తెలిసింది. అయితే మధ్యవర్తిత్వంతో మరో వ్యక్తికి కూడా ఆశోక్ అప్పు ఇచ్చినట్లు సమాచారం. ఈనేపథ్యంలో తన డబ్బు తిరిగి ఇవ్వాలని అశోక్ ఇద్దరినీ అడుగుతుందటంతో వారు అశోక్ పై కక్ష పెంచుకున్నారు. అశోక్ ను ఎలాగైనా చంపాలని పథకం వేశారు. శనివారం రాత్రి డబ్బులు ఇస్తామని ప్రేమ్ కు చెప్పడంతో అశోక్ తన ద్విచక్ర వాహనం పై ముత్యాలం పాడు క్రాస్ రోడ్ కు ఒంటరిగా వెళ్లాడు.
Read also: Shiva Rajkumar: ‘పుష్ప’ జపం చేస్తున్న కన్నడ సూపర్ స్టార్
ఇదే సమయం అని భావించిన దుండగులు అశోక్ ను స్థానిక పంచాయితీ కార్యాలయంలోకి తీసుకువెళ్లారు. అక్కడ అశోక్ కు గొంతు కోసి, చేతి మణికట్లు, కాలి చీల మండల నరాలు కోసి పాశవికంగా హత్య చేశారు. దీంతో తెల్లావారినా అశోక్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే.. అశోక్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు స్థానిక ఓ డెడ్ బాడీ ఉందని సమాచారం ఇచ్చారు. దీంతో ఇల్లెందు డీఎస్పీ రమణమూర్తి సంఘటన స్థలాన్ని వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఆమృతదేహం అశోక్ గా గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న కుటుంబ సభ్యులు అశోక్ హత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రేమ్ కుమార్ ఇంటిపై దాడి చేశారు. పోలీసులు వారిని శాంతింపజేశారు హత్య చేసింది గంజాయి బ్యాచ్ పని అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం, ఖమ్మంకు చెందిన వారితోనే హత్యచేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రేమ్ కుమార్‌ను అదుపులో తీసుకున్నట్లు సమాచారం.
Baaz Electric Scooter: 35 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!