Site icon NTV Telugu

రాజు ఆచూకీ కోసం పెట్టిన ఫోన్ నంబర్ లకు తలనొప్పి కాల్స్…

చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు అయిన రాజు ఆచూకీ, సమాచారం కోసం పెట్టిన ఫోన్ నంబర్ లకు తలనొప్పి తెప్పించే విధంగా కాల్స్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నెల 13న రాజు ఆనవాలు ,ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల రివార్డ్ ఇస్తామని ప్రకటించారు పోలీసులు. అందుకు రెండు ఫోన్ నంబర్ లను పబ్లిష్ చేసి వాటికి సమాచారం అందించాల్సిందిగా విస్తృత ప్రచారం చేసారు. దీంతో ఏకంగా 5 వేలకు పైగా మంది ఆ నంబర్లకు ఫోన్ కాల్స్ చేసినట్లు సమాచారం. దాంతో ఆ ఫోన్ కాల్స్ తో పోలీసులు నివ్వెర పోయారు. మొదట ప్రతి కాల్ ను తీసుకున్నారు పోలీసులు. అందులో కొందరు అది రాజు నంబర్ అనుకోని తిట్ల పురాణంతో ఫోన్ లు చేసారు. మరికొందరు హలో రాజు గంజాయి దొరుకుతుందా అని ఫోన్… మరికొంత మంది ఇక్కడ చూశాం ఇప్పుడే చూశాం ఈలోపే పారిపోతున్నాడు అంటూ ఫోన్ లు చేసారు. ఈ విధంగా 2 రోజుల వ్యవధిలో ఏకంగా 5 వేలకు పైగా కాల్స్ తీసుకున్నారు పోలీసులు.

Exit mobile version