NTV Telugu Site icon

Strange Incident: హైదరాబాద్‌లో ఓ వింత ఘటన.. భూమి నుంచి పొగలు

Kbr Park

Kbr Park

Strange Incident: హైదరాబాద్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను చూసిన వాహనదారులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జూబ్లీహిల్స్‌ కేబీఆర్‌ పార్క్‌ సమీపంలోని నేల నుంచి పొగలు కమ్ముకున్నాయి. మొదట పొగ చిన్నగా ఉండి క్రమంగా పెద్దదైంది. భూమి పొరల నుండి పొగ వచ్చింది. ఓ వైపు వర్షం కురుస్తుండగా తడి నేల నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడం అందరినీ అయోమయానికి గురి చేసింది. భూమి నుంచి పొగలు రావడంతో వాహనదారులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. మరికొందరు పొగలు వస్తున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. వర్షం కురుస్తున్న సమయంలో నీటిపై పొగలు రావడం చూసి ఆశ్చర్యపోయారు. ఏం జరిగిందో తెలియక అక్కడున్న వారందరూ అయోమయంలో పడ్డారు. హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తున్న కొద్దిసేపటికే ఇది జరిగింది. KBR పార్క్ సమీపంలోని నేల నుండి పొగలు వస్తున్న వీడియోలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Dowleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను మించి ప్రవహిస్తున్న గోదావరి..

Show comments