నిజామాబాద్ జిల్లాలో సంచలన ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్య గురైన ఘటన సదా శివనగర్‌లో చోటుచేసుకుంది. 15 రోజుల వ్యవధిలోనే కుటుంబ సభ్యులను వరసగా హత్య చేశాడు ఓ సైకో కిల్లర్. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. పోలీసులు తెలిపన వివరాలు ప్రకారం.. మాక్లుర్‌కు చెందిన ప్రసాద్ కుటుంబంలోని ఆరుగురు వరస హత్యకు గురయ్యారు. 15 రోజుల వ్యవధిలోనే కుటుంబం మొత్తాన్ని హత్య చేసి వివిధ ప్రాంతాల్లో మృతదేహాలు పారేశాడు హంతకుడు. ఈ క్రమంలో సదా శివనగర్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడంతో అసలు విషయం బయటపడింది.
Also Read: Bigg Boss 7 : ఒక్క బస్సు కాదు, 6 బస్సుల అద్దాలు ధ్వంసం.. ఇదేం అభిమానం, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్!
బాల్కొండ సోన్ బ్రిడ్జి సమీపంలో ఇద్దరు పిల్లల మృతదేహాలు, నిజామాబాద్ హైవేపై మృతదేహం, మాచా రెడ్డి లో మరొక మృత దేహం లభ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినది, మాక్లూర్‌కు చెందని ప్రసాద్ కుటుంబంగా పోలీసులు గుర్తించారు. వారిని హత్య చేసింది ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్‌గా సమాచారం. ఇంటి కోసమే అతడు కుటుంబాన్ని హత్య చేసినట్టు విచారణలో నిందితుడు తెలిపనట్టు తెలుస్తోంది. మాక్లుర్‌కు చెందిన ప్రసాద్ ఇటీవల తన భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెల్లతో మాచారెడ్డికి వలస వెళ్లాడు. ఇక మాక్లుర్‌లో ఉన్న అతడి ఇంటిని స్నేహితులు ప్రశాంత్ సొంతం చేసుకొవాలనుకున్నాడు.
Also Read: TS News: రేపటి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన జూనియర్ డాక్టర్లు..
పథకం ప్రకారం ప్రసాద్‌ను తీసుకేళ్లి నిజామాబాద్ – కామారెడ్డి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. ఆ తర్వాత ప్రసాద్ భార్యను చంపి బాసర నదిలో పడేశాడు. అతడి పెద్ద సోదరిని హతమార్చాడు. ఇక ప్రసాద్ ఇద్దరు పిల్లను హత్య చేసి మృతదేహాలను సోన్ బ్రిడ్జి సమీపంలో పడేశాడు. ఆ తర్వాత ప్రసాద్ చిన్న సోదరిని మాచారెడ్డిలో హత్య చేసినట్టు సమాచారం. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం మిస్సింగ్ కేసు నమోదు కాలేదని, దీంతో సుమోటో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగు చూసింది. ప్రస్తుతం ప్రశాంత్ పోలీసుల అదుపులో ఉన్నాడని, అతడిని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.ఈ కేసులో ముగ్గురు నిందితులుగా ఉన్నారని, అందులో ప్రధాన ప్రశాంత్ పోలీసుల అదుపులో ఉన్నాడు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసు అధికారి తెలిపారు. రేపు మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని కామారెడ్డి జిల్లా పోలీసులు పేర్కొన్నారు.