NTV Telugu Site icon

Sitaram Yechury: రాజకీయాల్లో సిద్ధాంతాలు, విలువలు లోపించాయి..

Jaipal Reddy Statue

Jaipal Reddy Statue

ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు, విలువలు లోపించాయని ఆవేదన వ్యక్తం చేశారు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి… రంగారెడ్డి జిల్లా మాడ్గులలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.. సీతారాం ఏచూరితో పాటు.. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, రాజ్య సభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. విద్యార్థి దశలో జైపాల్ రెడ్డి, నేను మొదటిసారిగా కలుసుకున్నాం.. జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.

Read Also: Sajjala Ramakrishna Reddy: కేసీఆర్‌ జాతీయ పార్టీపై స్పందించిన సజ్జల.. మేం క్లియర్‌..

మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో జైపాల్‌రెడ్డి, నేను ఇద్దరం కలిసి పనిచేశామని గుర్తుచేసుకున్నారు సీతారాం ఏచూరి.. ఏ సిద్ధాంతాల ఆధారంగా జైపాల్‌రెడ్డి రాజకీయాలు చేశారు.. కానీ, ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు, విలువలు లోపించాయని ఆవేదన వ్యక్తం చేశారు.. చివరి వరకు విలువలకు కట్టుబడిన నాయకుడు జైపాల్ రెడ్డి అన్నారు.. ఆయన లేకపోవడం దేశానికి తీరనిలోటన్న ఆయన.. దేశంలో నాలుగు స్తంభాలపై చాలా దాడులు జరుగుతున్నాయి.. ఈ ప్రమాదాల నుంచి తట్టుకుని దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.. ఇందుకు మళ్లీ సిద్ధాంతాలు, విలువలతో కూడిన రాజకీయాలు అవసరం.. జైపాల్ రెడ్డి స్పూర్తితో ఆ దిశగా ముందుకెళ్లాలని.. లౌకిక ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకునేందుకు పునః సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సీతారాం ఏచూరి..