Site icon NTV Telugu

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో కొత్త ట్విస్ట్.. మరొకరి అరెస్ట్

Sit Another Arrest

Sit Another Arrest

SIT Officials Arrested Tirupathayya In TSPSC Paper Leak Case: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా సల్కర్ పేట గ్రామానికి చెందిన తిరుపతయ్యను అదుపులోకి తీసుకున్నారు. పంచాంగుల తండాకు చెందిన రేణుక, డాక్య దంపతులకు అతడు అత్యంత సన్నిహితుడు అని తేలింది. డాక్య ద్వారా తిరుపతయ్య ఏఈ ప్రశ్నాపత్రాన్ని పొందినట్టు దర్యాప్తులో వెల్లడైంది. అతడు ఆ ఏఈ ప్రశ్నాపత్రాన్ని రాజేంద్ర కుమార్‌కు విక్రయించాడు. విచారణలో భాగంగా తిరుపతయ్యను తొలుత హిమాయత్ నగర్ సిట్ కార్యాలయానికి అధికారులు తీసుకొచ్చారు. అక్కడ అతడ్ని విచారించిన సిట్.. అతని వద్ద నుంచి కొన్ని పత్రాల్ని స్వాధీనం చేసుకుంది. ఇతని ఉపాధి మామీ పథకంలో పని చేస్తున్నట్టు గుర్తించారు.

Bhatti Vikramarka: రాష్ట్రాన్ని కేసీఆర్ 70 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు.. బీఆర్ఎస్ పాలనంతా స్కాములమయం

ఇదిలావుండగా.. దర్యాప్తులో భాగంగా ప్రవీణ్ ఇంట్లో రూ.5 లక్షల నగదును సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిజానికి.. మొదటిసారి కస్టడీలో ప్రవీణ్ నోరు మెదపలేదు. అయితే.. రెండోసారి కస్టడీలో భాగంగా సిట్ అధికారులు తమదైన శైలిలో ప్రశ్నింగా.. ప్రవీణ్ నోరు విప్పాడు. అతడు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఇంట్లో సోదాలు నిర్వహించగా.. రూ.5 లక్షల నగదు లభ్యమైంది. శంకర్ లక్ష్మి డైరీ నుంచి పాస్‌వర్డ్ చోరీ చేసి, కంప్యూట‌ లోకి ప్రవీణ్ చోరబడినట్టు సిట్ అధికారులు తేల్చారు. అటు.. రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్‌కు ఎల్ఓసీ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు.. ప్రశాంత్ న్యూజిలాండ్ నుంచి గతేడాది అక్టోబర్‌లో వచ్చి గ్రూప్ 1 ప్రిలి రాశాడు. ఈ ప్రశ్నాపత్రాన్ని అతడు రాజశేఖర్ ద్వారా పొందినట్లు గుర్తించారు. కాగా.. ఇప్పటివరకు గ్రూప్ 1 పరీక్ష రాసి, 100 మార్కులకు పైగా సాధించిన 40 మంది అభ్యర్థులను సిట్ అధికారులు విచారించారు. వారికి పరీక్ష రాసే సామర్థ్యం ఉందా లేదా అని.. ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్ట్ అనంతరం ఆ 40 మందికి లీకేజీతో సంబంధం లేదని నిర్ధారించారు.
Janhvi Kapoor: ఎన్టీఆర్ భామ మెరుపులను తట్టుకోవడం కష్టమే..

Exit mobile version