Site icon NTV Telugu

Palvai Harish: మీపేరుతో అక్రమ వసూళ్లు చేస్తున్నారు.. మంత్రి సీతక్కకు సిర్పూర్ ఎమ్మెల్యే లేఖ

Palvai Harish

Palvai Harish

Palvai Harish: మంత్రి సీతక్కకు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు బహిరంగ లేఖ రాశారు. మంత్రి సీతక్క పేరు చెప్పి అక్రమ వసూళ్ళకు కాంగ్రెస్ నాయకులు పాలడుతున్నారని ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన కోనప్ప, ఆయన అల్లుడు కలసి అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
సిర్పూరు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు అధికార పార్టీ పేరుతో పాటు తమరి పేరును వాడుకుంటూ నియోజకవర్గంలో ఆశ్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇక్రమ చంచాలకు మారుపేరుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కీ.. కోనేరు కోనప్ప ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం మీకు తెల్సిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేనల్లుడు రావి శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Read also: Road Accident: లారీ బీభ‌త్సం.. బైకును ఈడ్చుకుంటూ.. వీడియో వైరల్..

గతంలో వీరద్దరు చేసిన అక్రమాల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నానని తెలిపారు. ఎందుకంటే కంఫోమ్ పార్టీ అధికారంలో లేని సమయంలో మీరు ఈ నియోజకవర్గానికి వచ్చినపుడు ప్రతిపక్ష హోళాదాలో మీరు వీరి ఆక్రమాల గురించి స్వయంగా తెలుసన్నారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేరు కోనప్ప అధికారపార్టీ పేరుతో నియోజకవర్గంలో చేయని నెంబర్ లేదు. అంతేకాకుండా వ్యాపారులను, అధికారులను బెదిరించి ఆశ్రమ వసూళ్లకు కూడా పాల్పడ్డారు. అతని అన్నదాన సత్రం నడువడానికి ఫండ్ పేరిట ఆక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. ఎన్నికలలో ఓటమి అనంతరం అతని నిత్యాన్నదాన సత్రాన్ని మూసివేశారు. ఇతనిదో నెంబర్ దందాలు మళ్లీ యధాతథంగా కొనసాగడానికి అధికారపార్టీ అండదండలు అవసరమని భావించి మళ్లీ కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరారనేది బహిరంగ రహస్యమే.

Read also: Samsung AI TV 2024: ఏఐ ఫీచర్లతో శాంసంగ్‌ స్మార్ట్‌టీవీలు.. ధర తెలిస్తే మైండ్ బ్లాకే!

ఇది మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఎప్పుడైతే కాంగ్రెస్‌ పార్టీలో చేరారో అప్పటి నుండే తన దో నెంబర్‌ దందాలను కొనసాగించడం, నిత్యాన్నదాన సత్రానికి ఫండ్‌ వసూలు చేయడం ప్రారంభించాడు. దీనికి అతని మేనల్లుడు, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి రావి శ్రీనివాస్ అన్ని విధాలా సహకరిస్తూ మీ పార్టీని ఆప్రతిష్టపాలు చేస్తున్నారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు కూడా వారికి కలిసివచ్చాయి. ఈ ఎన్నికల సందర్భాన్ని, తమరి పేరును వాడుకొని అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నారు. దీనికి ఉదాహరణ కూడా మీ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగజ్ నగర్ పట్టణానికి చెందిన ఒక స్త్రీ వైద్య నిపుణురాలిని బెదిరింపులకు గురి చేసి లోక్ సభ ఎన్నికలకు ఫండ్స్ కావాలని, మంత్రి సీతక్క అడగమని చెప్పాడంటూ మీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Read also: Gold Price Today : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

ఆ వైద్యురాలు నా వద్దకు వచ్చి తన ఆవేదన చెప్పుకోవడంతో అది మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఇదొక్కటే కాదు. ఇలాంటి సంఘటనలు మరెన్నో ఉన్నా నేతల తీరుతో నియోజకవర్గంలోని ఏడు మండలాలలోని చిన్నా చితకా అధికారపార్టీ లీడర్లు కూడా అదే విధంగా అక్రమ వసూళ్లకు తెగించారు. కావున ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించి ఈ మామా అల్లుళ్ల ఆరాచకాలను, అక్రమ వసూళ్లను అరికట్టి ప్రజలకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశ్యంతో ఈ లేఖ మీరు రాయడం జరుగుతోందని తెలిపారు. మరి దీనిపై మంత్రి సీతక్క ఎలా స్పందిస్తారన్న దానిపై చర్చకు దారితీస్తోంది.
Rukshar Dhillon: మత్తికించే కళ్ళతో పిచ్చెక్కిస్తున్న రుక్సార్ ధిల్లాన్…

Exit mobile version