రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు మరోసారి తన దాడితో సంచలనాన్ని సృష్టించారు. భూమి సర్వే కోసం లంచం తీసుకుంటుండగా సిరిసిల్ల మండల సర్వేయర్ వేణును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, సిరిసిల్ల పట్టణానికి చెందిన ఇరుకుల ప్రవీణ్ అనే వ్యక్తికి చిన్న బోనాలలో మూడు ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని సర్వే చేయడంలో భాగంగా సర్వేయర్ వేణు రూ.30 వేలు లంచం కోరినట్లు తెలుస్తోంది.
Taliban Declare Victory: పాకిస్థాన్‌పై విజయం సాధించాం.. వేడుకల్లో మునిగిపోయిన ఆఫ్ఘన్లు..!
దీంతో బాధితుడు ఇరుకుల ప్రవీణ్ కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందుగా సర్వేయర్‌కి రూ.10 వేలు అప్పజెప్పగా, తర్వాత పంచనామా సర్టిఫికెట్ కోసం మిగతా రూ.20 వేలు అందజేయడానికి ఒప్పుకున్నాడు. ఈ సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు సిరిసిల్ల ఎమ్మార్వో కార్యాలయంలో మాటు వేశారు. బాధితుడు చేతిలోని రూ.20 వేల లంచం తీసుకుంటున్న వేణును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ ఘటనతో జిల్లా అధికార వర్గాల్లో కలకలం రేగింది. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో తక్కువ సమయంలో జరిగిన రెండో సర్వేయర్ అరెస్ట్ కావడం గమనార్హం. గత మే నెలలో ఎల్లారెడ్డిపేట సర్వేయర్ లంచం కేసులో పట్టుబడగా, ఇప్పుడు సిరిసిల్ల సర్వేయర్ వేణు ట్రాప్‌లో చిక్కుకోవడంతో జిల్లా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
Yashasvi Jaiswal: నెక్స్ట్ ‘షేన్ వార్న్’ యశస్వి జైస్వాలే.. వీడియో వైరల్!
