టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ కార్యక్రమంలో తాజాగా ప్రముఖ గాయని సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్కులో సింగర్ సునీత మొక్కలు నాటారు. అనంతరం సునీత మాట్లాడుతూ.. సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రకృతి కన్నతల్లి లాంటిది అని.. కన్నతల్లిని ఎలా ప్రేమగా చూసుకుంటామో.. అదేవిధంగా మన ప్రకృతిని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అభిప్రాయపడ్డారు. పర్యావరణాన్ని పరిరక్షిద్దామని.. రాబోయే బావి తరాలకు మంచి వాతావరణం అందిద్దామని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సినీ గేయ రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, డైరెక్టర్ నందిని రెడ్డి ముగ్గురికీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సవాల్‌ను గాయని సునీత విసిరారు.
Green India Challenge: జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్కలు నాటిన గాయని సునీత

Sunitha Green India Challenge Min