జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆపారమైన సహజ సంపదకు కేరాఫ్ గా మహదేవపూర్ ప్రాంతం నిలుస్తుందని చెప్పడంలో అతియోశక్తి లేదు. టేకు కలప, ఇసుక ఇప్పటికే ఉండగా బొగ్గు నిక్షేపాలతో మరోమారు దేశం దృష్టిని ఆకర్షించనుంది. మహదేవపూర్ లో ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రపంచ స్థాయి గుర్తింపు రాగా చండ్రుపల్లిలో బొగ్గు నిక్షేపాలు జాడలు బయటపడటంతో మరోసారి ఆ ప్రాంతంపై అందరి దృష్టి పడింది.
రెండేళ్ల కిందట రైతు జాడి సురేందర్ తన పొలంలో వ్యవసాయానికి ప్రైవేటు వాహనంతో బోరు వేయించాడు. బోరు 40 ఫీట్ల లోతుకు వెళ్లిన తర్వాత నల్లని రంగులో బొగ్గు రూపంలో ఉన్న ఒక పదార్ధం బయటికి వచ్చింది. నల్లని రంగుతో కూడిన చిన్నచిన్న బిళ్లలుగా తడితడిగా అవి భయటపడ్డాయి. ఆ తర్వాత 250 ఫీట్ల లోతులో నీళ్లు పడ్డాయి. మొత్తం 300 ఫీట్ల వరకు బోరు వేశారు. బోరు ప్రాంతమంతా బొగ్గు ఉన్నట్లుగా వాసన వెదజల్లుతోంది. దీంతో రైతులకు బొగ్గు కనబడడంతో అవాక్కయ్యారు. తమ పొలంలో బొగ్గు పడిందని గ్రామస్తులకు తెలిపారు.
1992-94లో ఓఎన్జీసీగా ఉన్న ఆయిల్ నేచర్ గ్యాస్ సంస్థ బొగ్గు ఉన్నట్లు పరిశోధన చేసి కనుగొంది. ఆ తర్వాత సింగరేణి సంస్థ కూడా చండ్రుపల్లి, నాగేపల్లి, అన్నారం, సస్తూర్పల్లి, తాడిచర్ల ప్రాంతాల్లో బొగ్గు కోసం అన్వేషించింది. అప్పుడు మహదేవపూర్ ప్రాంతంలో నక్సలైట్ల ప్రభావం ఎక్కువ ఉండటం అభయారణ్యం కావడంతో పోలీసులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడం చండ్రుపల్లి శివారులో సింగరేణి సంస్థకు చెందిన భారీ యంత్రాన్ని నక్సలైట్లు కాల్చివేశారు. బొగ్గు నిక్షేపాలు వెలికితీతను ఆపాలని హెచ్చరించారు. అప్పుడు ఆ సంస్థ వెనుదిరిగాయి. మల్హర్ మండలం తాడిచర్లలో కూడా బొగ్గు ఉన్నట్లు అదే సమయంలో కనుగొన్నారు.
అయితే ప్రస్తుతం మహదేవపూర్ బ్లాక్-1, చంద్రుపల్లి బ్లాకులుగా బొగ్గు గురించి అన్వేషణ చేసి పలిమెల మండలంలోని లెంక లగడ్డ, సర్వాయిపేటలో కూడా బొగ్గు ఉన్నట్లు ఆయిల్ నేచర్ గ్యాస్ సంస్థ సర్వే చేశారు. అదే విధంగా సింగరేణి ఎక్స్ప్లోరేషన్ డిపార్టుమెంట్ చండ్రుపల్లి ప్రాంతంలో బొగ్గుపై దృష్టిసారిస్తే విలువైన బొగ్గు సంపద బయటికి వస్తుందని ఎంతో మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని,పరిసర గ్రామా అభివృద్ధి జరుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సింగరేణి అధికారులు స్పందించి సర్వే చేసి చండ్రుపల్లిని ఓపెన్ కాస్ట్ చేయాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.
Aus vs SL: లంక ఆటతీరుపై ట్రోల్స్.. 28 పరుగుల వ్యవధిలోనే హాంఫట్