Site icon NTV Telugu

Robbery: సిద్దిపేటలోని జ్యువెలరీ షాపులో చోరీని ఛేదించిన పోలీసులు..

Siddiper Crime

Siddiper Crime

Robbery: సిద్దిపేటలో ఈ నెల 18న నయిమ్ మియా జ్యువెలరీ షాపులో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్న షణ్ముఖ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇతను ఏపీలోని విశాఖపట్నం మద్దిలపాలెంకి చెందిన వాడిగా గుర్తించారు. బంగారం కొనడానికి వచ్చి షాపులో నుంచి 8 తులాల బంగారు చైన్ ట్రేని షణ్ముఖ రెడ్డి ఎత్తుకెళ్లాడు. దీంతో మాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫోటేజ్ ఆధారంగా షణ్ముఖ రెడ్డిని పక్కాప్లాన్ తో పట్టుకున్నారు. హైదరాబాద్ లో ఫ్రెండ్ బైక్ అడిగి దానిపై సిద్దిపేట వచ్చి షణ్ముఖ దొంగతనం చేసినట్లు వివరించారు.
దుద్దేడ టోల్ గేట్ వద్ద వ్వాహనాల చెకింగ్ ఉండటంతో బైక్ పై వేగంగా వెళ్తూ నిందితుడు కిందికి పడిపోయాడు. గాయాలతో బైక్ ని ప్రజ్ఞాపూర్ లో పార్క్ చేసి వేరే షర్ట్ మార్చుకుని బస్సులో నిందితుడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ప్రజ్ఞాపూర్ లో బైక్ తీసుకుని హైదరాబాద్ లో బంగారం అమ్మితే దొరికిపోతానని కరీంనగర్ లో దొంగిలించిన బంగారం అమ్మడానికి బయలుదేరాడు. పొన్నాల రంగిలా దాబా వద్ద పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే నిందితున్ని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 8 తులాల బంగారం, దొంగతనానికి ఉపయోగించిన బైక్ స్వాధీనం చేసుకున్నారు.
Yadadri Temple: గుట్ట మీద భక్తుల బసకు ఏర్పాటు.. దాదాపు 200 వరకు గదులు..!

Exit mobile version