NTV Telugu Site icon

Ponnam Prabhakar: గీతా కార్మికులకు త్వరలో మోపెడులు.. గుడ్ న్యూస్‌ చెప్పిన పొన్నం ప్రభాకర్‌

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: గీతా కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా.. వచ్చే ఏడాది మార్చ్ తర్వాత గీత కార్మికులకు మోపెడులు ఇస్తాం తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గీతా కార్మికులకు కాటమయ్య రక్షక కవచ్ కిట్లను పంపిణీ చేసిన మంత్రి మాట్లాడుతూ.. తాటి చెట్టు నుండి పడి గీతా కార్మికులు చనిపోతున్నారనే ఈ కాటమయ్య కిట్ తయారు చేశారన్నారు. తాటి చెట్టు ఎక్కే ప్రతి వ్యక్తికి ఈ కిట్ ఇస్తాం, ప్రభుత్వంతో పాటు శాసనసభ్యుని, పార్లమెంట్ సభ్యుని నిధులు కూడా వెచ్చించి ఈ రక్షణ కవచాలు పంపిణీ చేస్తున్నామన్నారు. తాటి చెట్లు ఎత్తు తక్కువగా ఉండేలా కూడా శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. రోడ్లమీద వేరే చెట్లు పెడితే ఎలాంటి ఉపయోగం లేదని ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో చర్చించారు. 50% తాటి ఈత చెట్లను కాలువలు, రోడ్ల పక్కన, చెరువుల గట్ల పైన నాటాలని సూచించారు. ఈ కిట్లను గీతా కార్మికులు జాగ్రత్తగా వాడుకోవాలని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా మార్చ్ తర్వాత గీత కార్మికులకు మోపెడులు ఇస్తామని మంత్రి తెలిపారు.

Read also: Health Benefits: సన్నగా ఉన్నానని బాధపడుతున్నారా? ఇవి తినండి చాలు..

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్తకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యకు పెద్ద పీట వేస్తూ ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధతో ముందుకు వెళ్తుందన్నారు. ఈ ప్రభుత్వన్నీ ముందంజలో ఉంచడానికి అమ్మ ఆదర్శ పాఠశాలలను ప్రతి నియోజకవర్గనికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సుమారు 125 నుంచి 150 కోట్లతో పేద పిల్లలకు కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రవేటు కార్పొరేటర్ లకు దీటుగా పేద ప్రజలకు ప్రభుత్వ కాలేజీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇంటర్ నేషనల్ కళాశాఖలో వుండే అన్ని వసతులతో ఏర్పాటు చేసే విధంగా చూస్తామన్నారు. అమ్మవారి గుడికి అభివృద్ధికి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. అమ్మవారి ఆలయం అభివృద్ధి గురించి సీఎం రేవంత్ రెడ్డి కలసి తెలియజేస్తా అన్నారు. భద్రాచలంలో ఏ విధంగా అయితే ప్రభుత్వం అభివృద్ధి చేయలని అనుకుంటుందో ఈ అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఈ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు.
PM Modi: ఉగ్రవాదులు భారత్‌ను భయ పెట్టలేరు.. ఎందుకంటే..