NTV Telugu Site icon

Harish Rao: అది నోరా మొరా.. రాహుల్ గాంధీపై మంత్రి హరీష్ రావు ఫైర్

Harish Rao Rahul Ganshi

Harish Rao Rahul Ganshi

Harish Rao: అది నోరా.. మొరా.. మీకు మొక్కాలి అంటూ రాహుల్ గాంధీపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిద్ధిపేట నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పర్యటించారు. సిద్దిపేటలోని పత్తి మార్కెట్ యార్డులో రైతులకు స్పింక్లర్లను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేసారు. అనంతరం మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ అంటున్నారని ప్రశ్నించారు. రైతుల భూములకు, అటవీశాఖ 10 వేల కోట్లు ఇచ్చినామని తెలిపారు. కాళేశ్వరంతో ఏంపని కాలేదు అన్ని బట్ట కాల్చి మీద వేస్తున్నారు? అంటూ మండిపడ్డారు. కాళేశ్వరం పూర్తి కాకపోతే ఇంత పంట ఎలా పండింది? అని ప్రశ్నించారు. అది నోరా లేక మొరా మీకు మొక్కలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగనాయక సాగర్ లో ముంచి బయటికి తీస్తే నీళ్లు వచ్చాయా లేదా తెలుస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క చెరువు కూడా మరమ్మతు చేయలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలిస్తే మాకు కాళేశ్వరం రాకపోవు.. పంటలు పొండకపోవు అంటూ అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కట్టింది 80 వేల కోట్లు లక్ష కోట్లు ఎక్కడివి రాహుల్ గాంధీ? అంటూ ప్రశ్నించారు.

Read also: Balagam Movie: ‘బలగం’కు మరో అరుదైన రికార్డు.. ఏకంగా 100 ఇంటర్నేషనల్ అవార్డులు

అంతకు ముందు కొమురవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని మంత్రి హరీష్‌రావు దర్శించుకుని మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అంనతరం రూ.12 కోట్ల వ్యయంతో క్యూలైన్ల కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శంకుస్థాపన చేశారు. కాగా.. మల్లన్న సాగర్ నీటితోనే సీఎం కేసీఆర్ స్వామివారికి అభిషేకం చేశారని మంత్రి అన్నారు. ఇక.. జాతీయ రహదారి నుంచి ఆలయం వరకు డబుల్ రోడ్ నిర్మాణ పనులను వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. అంతేకాకుండా.. ఆలయానికి సంబంధించిన వంద గదుల సత్రం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఇక గుట్టపై దాతల సహకారంతో భక్తుల సౌకర్యార్థం గదులను నిర్మిస్తున్నామని, కొమురవెల్లి దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతోందని మంత్రి తెలిపారు. కాగా.. గతంలో ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ ఉండేవని కానీ, ప్రస్తుతం ప్రతీ యేటా దాదాపు రూ.18 కోట్ల ఆదాయం వస్తోందని తెలపారు. మల్లన్న స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభీక్షంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు.
MLA Raghunandan Rao: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అరెస్ట్.. కారణం ఇదే..