NTV Telugu Site icon

Harish Rao: బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతుంది..

Harish Rao

Harish Rao

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురుకులాల దీనస్థితి చూస్తే, బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతుందని హరీష్ రావు అన్నారు. ఒకవైపు నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ కేజీబీవీ పాఠశాలలో “ఈ బువ్వ మేము తినలేము, మమ్మల్ని తీసుకెళ్లండి” అని తల్లిదండ్రులను విద్యార్థులు వేడుకుంటున్నారు. మరోవైపు అనంతపేట్ కేజీబీవీ పాఠశాలలో విషాహారం తిని పదిమంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన దుస్థితి అని హరీష్ రావు తెలిపారు. విషాహారం తిని వాంకిడి గురుకుల విద్యార్థిని మరణించిన ఘటన మరువకముందే ఇలాంటివి పునరావృతం కావడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.

Read also: DGP Jitender Reddy: జీరో శాతం డ్రగ్స్ నిర్మూలన.. 20 టన్నుల గంజాయి సీజ్..

ఒకప్పుడు గురుకులాల్లో సీట్ల కోసం క్యూ కట్టేవారు. ఇప్పుడు అదే గురుకులాల నుంచి ఇంటి బాట పట్టేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ ఊదరగొట్టిన మార్పు ఇదేనా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో చదువు సంగతి దేవుడెరుగు, పిల్లలు ప్రాణాలతో బ్రతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. “ఈ బువ్వ మాకొద్దు, ఇక్కడ మేము ఉండలేము” అని విద్యార్థులు వేడుకుంటున్నారని తెలిపారు. కన్నబిడ్డల ఆవేదన చూడలేని తల్లిదండ్రులు గురుకులాలకు వచ్చి బిడ్డలను తోలుకపోతున్నారని హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Read also: జనవరి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..

ఏడాదిలో మీ పాలన వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా మీవే ఉండి భావి భారత పౌరుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ చేతగాని పాలన గురుకుల విద్యార్థులకు శాపంగా మారిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి, విద్యార్థుల ప్రాణాలను కాపాడే చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
మైగ్రేన్‌ తలనొప్పితో బాధ పడుతున్నారా? ఇలా ట్రై చేయండి

Show comments