NTV Telugu Site icon

Harish Rao Flexi: సిద్దిపేటలో అర్ధరాత్రి టెన్షన్ వాతావరణం..

Siddipet

Siddipet

Harish Rao Flexi: సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. హరీష్ రావు రాజీనామా చేయాలన్న ఫ్లెక్సీల ఏర్పాటుతో వివాదం రాజుకుంది. రూ.2 లక్షల రుణమాఫీ అయ్యింది..హరీష్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత పూజల హరికృష్ణ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలను తీసేయ్యడానికి బీఆర్ఎస్ నాయకుల యత్నించారు. అర్ధరాత్రి రోడ్డుపైకి కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోటాపోటీ నినాదాలతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. పోటాపోటీ నినాదాలతో రోడ్డుపై కాసేపు ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఫెక్సీలు తీసేయాలని బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించడంతో వారిని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. రాజీనామా చేసి తీరాల్సిందే అని పట్టుబడటంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానిక సమచారంతో ఘటన వద్దకు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం మరికొందరిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Sabarmati Express: కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్..

హైదరాబాద్‌ నగరంలో మాజీ మంత్రి హరీష్‌ రావుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కలకలం రేపిన విషయం తెలిసిందే. రుణమాఫీ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయలేదని, అలాగానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని గతంలో హరీష్‌ రావు వ్యాఖ్యలపై ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మైనంపల్లి అభిమానుల పేరిట వెలసిన ఫ్లెక్సీల్లో ఈ ఫ్లెక్సీల్లో దమ్ముంటే రాజీనామా చెయ్.. రుణ మాఫీ అయి పోయే.. నీ రాజీనామా ఏడ బోయే.. అగ్గిపెట్ట హరీశ్ రావు’ అని రాశారు. ఈ ఫ్లెక్సీలను సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్ పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. మరోవైపు తన రాజీనామా సవాల్‌పై హరీశ్‌రావు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డికి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే..
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?